ఉద్యోగులను వడ్డీలతో పీడిస్తున్నాడు... | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులను వడ్డీలతో పీడిస్తున్నాడు...

Aug 11 2026 1:42 AM | Updated on Aug 11 2026 1:42 AM

ఉద్యోగులను వడ్డీలతో పీడిస్తున్నాడు... భార్య దౌర్జన్యం చేస్తోంది వడ్డీలతో పీడిస్తున్నాడు.. ఫిర్యాదు చేశామని బెదిరింపులు మోసం చేసిన మనమడు న్యాయవాదులపై దాడులు అరికట్టాలి

పోలీస్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదుల వెల్లువ సమస్యలను పరిష్కరించాలంటూ బాధితుల వేడుకోలు పీజీఆర్‌ఎస్‌కు 199 అర్జీలు

లక్ష్మీపురం: పోలీస్‌ గ్రీవెన్స్‌(పీజీఆర్‌ఎస్‌)కు అర్జీలు వెల్లువెత్తాయి. బాధితులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సమస్యలను అధికారులకు విన్నవించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 199 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పోలీసింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి, జిల్లా మహిళా పోలీస్‌ స్టేషన్‌, సీసీఎస్‌, ఈస్‌ డీఎస్పీలు శ్రీనివాస్‌ రెడ్డి, శివాజీ, బి.సీతారాం, జీఆర్‌ఎస్‌ సీఐ, బిలాలుద్దీన్‌ పాల్గొన్నారు.

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న అడిషనల్‌ ఎస్పీ రమణమూర్తి

మాది చేబ్రోలు మండలం, మంచాల. చిల్లర కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. నాకు భార్య ఇద్దరు సంతానం. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. నాలుగేళ్లగా భార్య జ్యోతితో విడిగా ఉంటున్నా. అయితే ఇద్దరు పిల్లలు నా వద్దనే ఉంటున్నారు. ఇటీవల ప్రభుత్వం కేటాయించిన తల్లి వందనం పథకంలో నగదు నా భార్య జ్యోతి ఖాతాలో జమా అయ్యాయి. అయితే ఇద్దరు పిల్లల పోషణ కోసం తల్లికి వందనం నగదు ఇవ్వమంటే ఇవ్వక పోగా బెదిరింపులకు దిగుతోంది.

–వి.నాగభూషణం, వికలాంగుడు

మా కుటుంబ ఖర్చుల నిమిత్తం గుంటూరు గౌతమినగర్‌, ముత్యాలరెడ్డి నగర్‌ ప్రాంతానికి చెందిన కె.రత్నారెడ్డి వద్ద అప్పుగా తీసుకున్నాం. రూ.10 వడ్డీ వసూలు చేస్తున్నాడు. అప్పు తీసుకునే సమయంలో మా వద్ద మూడు ప్రామిసరీ నోట్లు, మూడు ఖాళీ చెక్కులు, ఏటీఏం, బ్యాంక్‌ పాస్‌ బుక్‌లను తీసుకున్నాడు. అప్పు పూర్తిగా జమా అయినప్పటికి ఇంకా వడ్డీ రావల్సి ఉందంటూ వేధించడం, బెదిరించడంతో పాటు రత్నారెడ్డి బినామి పేర్లతో మాపై కోర్టులో కేసులు వేయించడం వంటివి చేస్తు వేధింపులకు గురి చేస్తున్నాడు. రత్నారెడ్డి పై 2019లో కాల్‌మనీ కేసు ఉంది. ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్ద రత్నారెడ్డి అనుచరులను పంపించి బెదిరింపులకు దిగుతున్నాడు. న్యాయం చేయాలి.

–గన్నెపల్లి శ్రీనివాసరావు, వెంకటప్రసాద్‌, విజయ్‌బాబు,మిసాల శ్రీనివాసరావు, ప్రభుత్వ ఉద్యోగులు

నాకు వేమవరంలో ఏడు ఎకరాలు, విశదలలో 4 ఎకరాల పొలం ఉంది. గతంలో మా పొలాలను దౌర్జన్యంగా బోల్లా చౌదరి ఆక్రమించుకున్నాడు. గతంలో ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశా. మేడికొండూరు అతడిని పిలిపించారు. దీంతో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తావా అంటూ ఇంటికి వచ్చి బెదిరింపులకు దిగాడు. రక్షణ కల్పించాలి.

–కళ్లం శేషమ్మ, వృద్ధురాలు, శ్యామలానగర్‌

నా భర్త వసంతరావు 2020లో మృతి చెందాడు. నా పేరు మీద 1.65 సెంట్ల పొలం ఉంది. నా భర్త మొదటి భార్య మనమడు సురేష్‌ 2024లో నా పొలాన్ని గజాల్లోకి చేయాలని లేదంటే పొలానికి విలువ లేదని నా పేరు మీద చేయిస్తానని, సురేష్‌తో పాటు బెజవాడ రమేష్‌ కూడా వచ్చి నమ్మబలికి మందడం రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి తీసుకునివెళ్లి వేలిముద్రలు వేయించారు. పొలాన్ని అమ్ముకున్నాడు. అడుగుతుంటే గ్రామానికి వస్తే చంపేస్తా అని బెదిరిస్తున్నాడు. గతంలో తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బెజవాడ రమేష్‌, పులి సురేష్‌ వలన నాకు ప్రాణ హాని ఉంది. రక్షణ కల్పించాలి.

–పులి సువార్త, కుమార్తె పులి అమూల్య, ఉద్దండ్రాయపాలెం, తుళ్లూరు మండలం,

గుంటూరు లీగల్‌: న్యాయవాదులపై దాడులు అరికట్టాలని పోలీస్‌ గ్రీవెన్స్‌లో న్యాయవాదులు అర్జీ అందించారు. తెనాలికి చెందిన న్యాయవాది ఖాదర్‌ హుస్సేన్‌, సత్తెనపల్లికి చెందిన న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. న్యాయవాది తప్పు చేసినట్లయితే చట్ట ప్రకారం ఫిర్యాదు చేసి న్యాయస్థానాలను ఆశ్రయించాలే తప్ప, దాడులు చేయడం లేదా కక్షపూరిత చర్యలకు పాల్పడటం చట్టబద్ధం కాదన్నారు. కార్యక్రమంలో గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావుతో పాటు తెనాలి న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement