కేఎల్‌యూలో ఏఐ బిల్డ్‌ 2026 హ్యాకథాన్‌ | - | Sakshi
Sakshi News home page

కేఎల్‌యూలో ఏఐ బిల్డ్‌ 2026 హ్యాకథాన్‌

Aug 11 2026 1:42 AM | Updated on Aug 11 2026 1:42 AM

కేఎల్‌యూలో ఏఐ బిల్డ్‌ 2026 హ్యాకథాన్‌ విద్యుత్‌ చౌర్యంపై కొరడా పోలీసుల అదుపులో దంపతులు

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి రూరల్‌ వడ్డేశ్వరంలోని కేఎల్‌ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఏఐ బిల్డ్‌ 2026 హ్యాకథాన్‌ కార్యక్రమం ఆదివారం రాత్రితో ముగిసింది. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 75కు పైగా ఇంజినీరింగ్‌ కళాశాలలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, ఏజెంటిక్‌ ఏఐ, జెనరేటివ్‌ ఏఐ, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌కు సంబంధించిన రియల్‌ వరల్డ్‌ ఇండస్ట్రీ సమస్యలపై పరిష్కారాలను రూపొందించారు. విద్యార్థుల్లోని సాంకేతిక, విశ్లేషనాత్మక, సృజనాత్మక సామర్‌ాధ్యలను పరిశ్రమ ప్రముఖల సమక్షంలో ప్రదర్శించే ఈ పోటీని 42 లెర్న్‌ రూపొందించింది. ఏఐ బిల్డ్‌ 2026 కార్యక్రమానికి సూపర్‌ మనీ చీఫ్‌ హూమన్‌ రీసోర్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వరదరాజు, సూపర్‌ మనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ కౌషిక్‌, ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్‌ ఆర్కిటెక్ట్‌ హనుమంతరావు, బజార్‌ వాయిస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనిబసవ, నార్తర్న్‌ ట్రస్ట్‌ సీనియర్‌ వైప్‌ ప్రెసిడెంట్‌ రాయడన్‌, బ్రిల్లియో ఆసియా పసిఫిక్‌ టాలెంట్‌ ఎక్విజిషన్‌ హెడ్‌ రితూ, రేజర్‌ పే ప్రపంచ లాలెంజ్‌ ఎక్విజిషన్‌ హెడ్‌ సుమిత్‌ ప్రేమీ సభ్యులుగా వ్యవహరించారు. 42 లెర్న్‌ ప్రెసిడెంట్‌ కోగంటి రాజశేఖర్‌ మాట్లాడుతూ ఏఐ బిల్డ్‌ 2026 ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌ ప్రతిభ ఎంత విస్తృతంగా ఉందో చాటిచెప్పిందన్నారు. వర్సిటీ వీసీ డాక్టర్‌ జి.పార్థ్ధసారథి వర్మ మాట్లాడుతూ ఈ పోటీలలో ప్రథమ విజేతగా కేఎల్‌ విశ్వవిద్యాలయం(టీమ్‌ మెంబర్లు ఎం.శేష్మ, సయ్యద్‌ మస్తాన్‌ వలి, ఎల్‌. శ్రామ్య), ద్వితీయ విజేతలుగా డీఎన్‌ఆర్‌ కళాశాల ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, భీమవరం, విజ్ఞాన్‌ నిరులా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ ఫర్‌ ఉమెన్‌, గుంటూరు, తృతీయ విజేతలుగా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం) కర్నూలు, నదింపల్లి సత్యనారాయణ రాజు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విశాఖపట్నం నిలిచాయని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రో వీసీలు డాక్టర్‌ ఎన్‌.వెంకటరామ్‌, డాక్టర్‌ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పవన్‌కుమార్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ సూపర్‌ మనీ కౌషికర్‌, ఎస్విపీఎల్‌ అండ్‌ డీ నోర్తర్న్‌ ట్రస్ట్‌ బ్యాంక్‌ డాక్టర్‌ రోయ్‌డాన్‌ గోన్సల్‌ వెజ్‌, గ్లోబల్‌ టీఏహెడ్‌ రీతు శర్మ బ్రిలియో, ప్రముఖ ఆర్కిటెక్ట్‌ వీపీ ఫ్లిక్‌కార్డ్‌ హనుమంతరావు, వర్సిటీ ప్లేస్‌మెంట్‌ విభాగం సీనియర్‌ డైరెక్టర్‌ శరవణ బాబు, 42 లెర్న్‌ సీఈఓ కోగంటి రాజ్‌ తదితరులు విజేతలను అభినందించారు.

రూ.11.80 లక్షల అపరాధ రుసుం విధింపు

కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్‌ చౌర్యం, అక్రమ విద్యుత్‌ వినియోగాన్ని అరికట్టేందుకు విద్యుత్‌ శాఖ విజిలెన్స్‌, ఆపరేషన్‌ విభాగాలు గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్‌ చల్లా రమేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. గుంటూరు నగరంలోని ఆర్‌టీసీ బస్టాండ్‌, పాతగుంటూరు, బాలాజీనగర్‌, సుద్దపల్లి డొంక, ప్రగతినగర్‌లలో సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 52 మంది అధికారులు, 156 మంది సిబ్బంది, 52 బృందాలుగా ఏర్పడి 4,069 సర్వీసులను తనిఖీ చేశారు. అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్‌ వాడుతున్న 243 మందికి రూ.11.72 లక్షలు, అనుమతించిన కేటగిరీకి కాకుండా ఇతర కేటగిరిలో విద్యుత్‌ వాడుకుంటన్న ఒక్కరికి రూ.8 వేలు మొత్తం కలిపి రూ.11.80 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు అధికారులు తెలిపారు. గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్‌ చల్లా రమేష్‌ మాట్లాడుతూ విద్యుత్‌ను అక్రమంగా వినియోగించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయ నష్టం కలగడమే కాకుండా విద్యుత్‌ వ్యవస్థపై అదనపు భారం పడుతుందని తెలిపారు. వినియోగదారులు నిబంధనలకు అనుగుణంగా విద్యుత్‌ సర్వీసులను వినియోగించాలని సూచించారు. అక్రమ విద్యుత్‌ వినియోగానికి పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్‌ చౌర్యం, అక్రమ విద్యుత్‌ వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే 9440812263, 9440812361 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని, వాట్సాప్‌ ద్వారా కూడా సమాచారాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. తనిఖీల్లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సీహెచ్‌ వెంకటేశ్వరరావు, విజిలెన్స్‌, ఆపరేషన్‌ విభాగాల డీఈఈలు పి.రమేష్‌, ఎన్‌.మల్లికార్జునప్రసాద్‌, కె.రవికుమార్‌, ఏఈలు షేక్‌ మస్తాన్‌, యు.ఉమాశంకర్‌, ఎం.సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తెనాలిరూరల్‌: పట్టణ చినరావూరుకు చెందిన యువతి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సకు చేరగా, నిజాంపట్నంలో చెరువులకు కాపలా ఉంటున్న దుర్గ, ఆమె భర్త చిన్నారావు యువతిని తమ వెంట తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. చిన్నారావు మహిళపై లైంగికదాడికి పాల్పడిన సంగతి విదితమే. త్రీ టౌన్‌ పోలీసులు కిడ్నాప్‌, రేప్‌, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల కింద కేసును ఆదివారం రాత్రి నమోదు చేశారు. అప్పటికే ఈ కేసులో నిందితులైన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గ ఏడు నెలల గర్భిణి కావడంతో తనకు నొప్పులు వస్తున్నాయని పోలీసులకు ఆదివారం రాత్రి చెప్పడంతో వైద్యశాలకు పంపగా, పరీక్షించిన వైద్యులు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడంతో పోలీసులు తిరిగి తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. బాధిత యువతికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement