నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక

Jul 17 2026 3:28 AM | Updated on Jul 17 2026 3:28 AM

మంగళగిరి టౌన్‌: నేషనల్‌ మాస్టర్స్‌ (మెడ్‌ అండ్‌ ఉమెన్‌) క్లాసిక్‌ అండ్‌ ఎక్యూప్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి గుంటూరు జిల్లాకు చెందిన పవర్‌ లిఫ్టర్లు ఎంపికయ్యారని జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరావు, సంధాని గురువారం తెలిపారు. ఈనెల 18 నుంచి 23 వరకు మహారాష్ట్ర ఛత్రపతి సంబోజి నగర్‌లో నిర్వహించనున్న పోటీలకు క్రీడాకారులు హాజరవుతారని చెప్పా రు. మాస్టర్స్‌–1లో 84 కిలోల విభాగంలో లక్ష్మీతులసి, మాస్టర్స్‌– 2లో 69 కిలోల విభాగంలో జ్యోతివర్మ, మాస్టర్స్‌–2 మెన్‌లో 93 కిలోల విభాగంలో మస్తాన్‌వలి టీమ్‌ తరఫున జిల్లాకు ఎంపికయ్యారని తెలిపారు. పోటీలకు ఎంపికైన పవర్‌లిఫ్టర్లు ఉత్తమ ప్రదర్శన చేసి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement