విజ్ఞాన్‌కు జాతీయ స్థాయిలో స్వయం ఎన్‌పీటీఈఎల్‌ ‘ఏఏ’ గ్రేడ్‌ | - | Sakshi
Sakshi News home page

విజ్ఞాన్‌కు జాతీయ స్థాయిలో స్వయం ఎన్‌పీటీఈఎల్‌ ‘ఏఏ’ గ్రేడ్‌

Jul 17 2026 3:28 AM | Updated on Jul 17 2026 3:28 AM

చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీకి భారతీయ సాంకేతిక విద్యా రంగంలో ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలిచే ఐఐటీ మద్రాస్‌ స్వయం– ఎన్‌పీటీఈఎల్‌ విడుదల చేసిన జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో ‘ఏఏ’ గ్రేడ్‌ లభించిందని వైస్‌ చాన్స్‌లర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా స్వయం–ఎన్‌పీటీఈఎల్‌ లోకల్‌ చాప్టర్‌ల పనితీరు ఆధారంగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో విజ్ఞాన్‌ యూనివర్సిటీ 22వ జాతీయ ర్యాంక్‌ను సాధించి ‘ఏఏ’ గ్రేడ్‌ను కైవసం చేసుకుందని తెలిపారు. ఎన్‌పీటీఈఎల్‌ నిర్వహించిన వివిధ ఆన్‌లైన్‌ కోర్సుల్లో విజ్ఞాన్‌ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొత్తం 5,851 కోర్సు సర్టిఫికెట్లను సాధించారని చెప్పారు. 2026 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఎన్‌పీటీఈఎల్‌ విద్యార్థులు ప్రదర్శించిన విశిష్ట ప్రతిభ, కోర్సులలో నమోదు, ఉత్తీర్ణత శాతం, టాపర్‌ విజయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ‘ఏఏ’ గ్రేడ్‌ ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. గ్రేడ్‌ సాధించేందుకు కృషి చేసిన ఎన్‌పీటీఈఎల్‌ లోకల్‌ చాప్టర్‌ కోఆర్డినేటర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, విభాగాధిపతులను చైర్మన్‌ లావు రత్తయ్య అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement