ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత

Feb 12 2026 7:33 AM | Updated on Feb 12 2026 7:33 AM

ఆక్రమ

ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత

పెట్రోల్‌ సీసాతో మహిళ హల్‌చల్‌ ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక వెనుదిరిగిన మున్సిపల్‌ అధికారులు

తెనాలి అర్బన్‌: తెనాలి శివాజీ చౌక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్‌ వద్ద అనధికారికంగా ఏర్పాటు చేసిన పరదాను తొలగించేందుకు వెళ్లిన మున్సిపల్‌ అధికారులు, పోలీసులకు నిర్వాహకురాలు చుక్కలు చూపించింది. దానిని తొలగిస్తే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండదండలు ఉండటంతో ఏమీ చేయలేక అధికారులు వెనుదిరిగారు. ఈ ఘటన తెనాలిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. మున్సిపల్‌ అధికారులు కథనం ప్రకారం... స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తృప్తి క్యాంటీన్‌లను నూతనంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనిలో భాగంగా తెనాలి నందులపేటకు చెందిన జాగృతి సంఘ నిర్వాహకురాలు నాగలక్ష్మి బుర్రిపాలెం రోడ్డులోని పాత రత్నటాకీసు వద్ద క్యాంటీన్‌ ఏర్పాటుకు మున్సిపల్‌ అధికారుల అనుమతి కోరింది. ఆమెకు టీడీపీ పెద్దల అండ ఉండటంతో అక్కడ స్థలం కేటాయించారు. ఆమె ఐడీబీ బ్యాంక్‌లో రూ.13.70 లక్షల రుణాన్ని తీసుకుని కంటైనర్‌ను ఏర్పాటు చేసి, ప్రారంభానికి సిద్ధంగా ఉంచారు. తర్వాత కంటైనర్‌ వద్ద శాశ్వత ప్రాతిపదికన షెడ్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేసింది. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ జేఆర్‌ అప్పలనాయుడు కంటైనర్‌ వద్ద షెడ్‌ నిర్మించవద్దని సూచించారు. కానీ ఆమె మంగళవారం రాత్రి ఇనుప పైపులు ఏర్పాటు చేసి దానిపై పరదాలు కప్పించింది.

ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత 1
1/2

ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత

ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత 2
2/2

ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement