జీజీహెచ్‌లో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో ఈ సంవత్సరం హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు మెడికల్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం తెలిపారు. కార్యక్రమాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబులు పర్యవేక్షించారు. 145 మంది హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ వేయడం జరిగిందన్నారు. గురువారం కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, హాజీ హసన్ బాషా పాల్గొన్నారు.
తెనాలి: నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వేంచేసి ఉన్న శ్రీవారాహి అమ్మవారి దేవస్థానంలో ఉచిత కోటి కుంకుమార్చన కార్యక్రమం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ మాచిరాజు వేణు గోపాల్, పెనుగొండ పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పాల్గొన్నారు. ముందుగా వారాహి అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉచిత కోటి కుంకుమార్చనను మహిళలతో చేయించారు. ఈ సందర్భంగా శ్రీవారాహి అమ్మవారి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. నిర్వాహకులు చివరిగా అతిథులను సత్కరించారు.
దాచేపల్లి : మండలంలోని సారంగపల్లి అగ్రహారంలో లక్ష్మీతిరుపతమ్మ, గోపయ్య స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం కనుల పండువలా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పురోహితుడు జానపాటి సీతారామశర్మ ఆధ్వర్యంలో అమ్మవారి కల్యాణం జరిపించారు. పుణ్యదంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేద పండితులు భక్తులకు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మాజేటి సూర్యవేణుగోపాల కృష్ణ శ్రేష్టి, కృష్ణకుమారి దంపతులు, ఎల్ కే శర్మ ఇందిరాదేవి దంపతులు వ్యవహరించారు. ఈవో గోపీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జీజీహెచ్‌లో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
జీజీహెచ్‌లో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
జీజీహెచ్‌లో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్


