ఇంజనీరింగ్‌ విద్యార్థి అవయవదానం | - | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ విద్యార్థి అవయవదానం

Feb 12 2026 7:33 AM | Updated on Feb 12 2026 7:33 AM

ఇంజనీరింగ్‌ విద్యార్థి అవయవదానం

ఇంజనీరింగ్‌ విద్యార్థి అవయవదానం

తాడేపల్లిరూరల్‌: ఖమ్మం జిల్లా మధిరకు చెందిన విజయ్‌కుమార్‌ (20) తాడేపల్లిలోని ఓ యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం విజయ్‌కుమార్‌కు బ్రెయిన్‌ డెడ్‌గా బుధవారం వైద్యులు నిర్ధారించారు. విజయ్‌కుమార్‌ తండ్రి సైదేశ్వరరావు, కుటుంబ సభ్యులు విజయ్‌కుమార్‌ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ జీవన్‌దాన్‌ చైర్మన్‌ డా. కె. రాంబాబు, హాస్పిటల్‌ డైరెక్టర్‌ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో అవయవ దానం చేశారు. గుండె, కాలేయం మణిపాల్‌ హాస్పిటల్‌లో అవసరమైన వారికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయగా, ఊపిరితిత్తులను హైదరాబాద్‌ కిమ్స్‌కు, కిడ్నీలకు విధాత హాస్పిటల్‌కు, కంటి కార్నియాను విజయవాడ ఎల్‌వి ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. విజయ్‌కుమార్‌ అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు మణిపాల్‌ హాస్పిటల్‌ వర్గాలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement