అపూర్వ ధైర్యశాలి టంగుటూరి | - | Sakshi
Sakshi News home page

అపూర్వ ధైర్యశాలి టంగుటూరి

Aug 24 2025 7:28 AM | Updated on Aug 24 2025 7:28 AM

అపూర్

అపూర్వ ధైర్యశాలి టంగుటూరి

నగరంపాలెం: స్వాతంత్య్ర సమరంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అపూర్వ ధైర్యసాహసాలతో బ్రిటిష్‌ వారి దౌర్జన్యాలకు ఎదురు నిలబడ్డారని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ అన్నారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మ గౌరవ పతాకదారుడు టంగుటూరి అన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎంగా ప్రజాస్వామ్య పరిపాలనకు బలమైన పునాదులేసి, విశేష సేవలందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ ఏడుకొండల రెడ్డి, ఎస్‌బీ సీఐలు అళహరి శ్రీనివాస్‌, సీహెచ్‌ రాంబాబు, ఆర్‌ఐలు సురేష్‌, శ్రీహరిరెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

స్ఫూర్తి ప్రదాత ప్రకాశం పంతులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిషు పాలకుల తుపాకీకి ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు తరతరాలకు స్ఫూర్తి ప్రదాత అని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిబసు మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టినా రాష్ట్రానికి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని వివరించారు. అత్యంత సాధారణ జీవనాన్ని సాగించిన ఆయన దేశభక్తి నేటి యువతకు మార్గదర్శకం కావాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో సీహెచ్‌ కృష్ణ, పరిపాలనాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి

నివాళులర్పిస్తున్న జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌

ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న

జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో కృష్ణ, ఉద్యోగులు

అపూర్వ ధైర్యశాలి టంగుటూరి 1
1/1

అపూర్వ ధైర్యశాలి టంగుటూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement