
యూరియా కొరత లేదనడం హాస్యాస్పదం
ఫిరంగిపురం: వ్యవసాయ పనులు ప్రారంభమైనప్పటికీ రైతులకు యూరియా అందుబాటులోకి రాలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం వ్యవసాయ కార్మికసంఘం సమావేశం నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ యూరియా కొరతతో రైతులు ఇక్కట్లు పడుతుంటే అధికారులు మాత్రం కొరత లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉపాధి హామీ కూలీలకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. పనులు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదని తెలిపారు. వ్యవసాయ పనులు లేక వారు నానా ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. సీఐటీయూ మండల కార్యదర్శి షేక్, మస్తాన్‌వలి, ఎ.అంకారావు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
కృష్ణా నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: తాడేపల్లి సీతానగరం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఓ మహిళ కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరం ఘాట్ వద్దకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయభార్గవి (28) అనే మహిళ తన కుమార్తె అనేక్యతో కలసి వచ్చింది. భార్గవి కృష్ణానదిలోకి దూకడంతో స్థానికులు గమనించి సమాచారం అందించారని తెలిపారు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పాప తన తండ్రి పేరు నరేష్ అని మాత్రమే చెబుతోందని, ఊరు పేరు చెప్పలేకపోయిందని తెలిపారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే తాడేపల్లి పోలీస్‌స్టేషన్ ఫోను నంబర్లు 86888 31361, 81438 73409, 97034 52206లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్ పేర్కొన్నారు. అనేక్యను విజయవాడలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు.

యూరియా కొరత లేదనడం హాస్యాస్పదం

యూరియా కొరత లేదనడం హాస్యాస్పదం