
వైభవంగా కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడ శైవ క్షేత్రమైన శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణ బహుళ అమావాస్యను పురస్కరించుకుని శనివారం కోటి కుంకుమార్చన, సామూహిక లలిత పారాయణ మహోత్సవం జరిగింది. కార్యనిర్వాహణాధికారి బి. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. ప్రధాన అర్చకుడు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ పూజా కార్యక్రమాలు జరిపారు. 10 లక్షల పారాయణ, కుంకుమార్చన, అమ్మవారికి శ్రీ సూక్త సహిత దేవి ఉపనిషత్తులతో అభిషేకం, కుంకుమార్చన, దేవీ హోమం, కుష్మాండ పూజ, కూష్మాండ బలి పూజా కార్యక్రమాలు జరిగాయి. పైనం రంగారెడ్డి దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చావలి శ్రీధర్‌శర్మ, మండవ రమేష్, పావులూరి రమేష్, పావులూరి సుబ్బారావు, వరలక్ష్మి, పొన్నపల్లి సత్యన్నారాయణ, జంజనం హేమశంకరరావు, కూచిబొట్ల శ్రీనివాసశర్మ, కళ్యాణ చక్రవర్తి స్వామి, పసుపులేటి కొండలస్వామి, పడమట వెంకటేశ్వరరావు, చింతల మురళీకృష్ణ, మండవ మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను కోటి కుంకుమార్చన కమిటీ, సహాయకులు పర్యవేక్షించారు.