
వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంపు
కొరిటెపాడు: జిల్లాలో వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంప్ ‘లక్ష్య’, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాచురేషన్ క్యాంపు (జనన సురక్ష క్యాంప్)ను నగరంపాలెంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. క్యాంపును కడప రీజియన్ రీజినల్ హెడ్ ఇ. వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. లక్ష్య, ఫైనాన్షియల్ ఇంక్లూజ్ సాచురేషన్ క్యాంపునకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. క్రెడిట్ క్యాంపెయిన్ సమయంలో ఎస్‌హెచ్‌జీ గ్రూపులు, సీకేసీసీ రుణగ్రహీతలకు రుణాలు మంజూరు చేశామని తెలిపారు. కండ్లకుంట బ్రాంచ్ హెడ్ అశోక్‌కుమార్, సిబ్బందితోపాటు ఏపీఎం, ఇతర సీసీఏలు ఈ క్యాంపులో పాల్గొన్నారని చీఫ్ మేనేజర్ బి.కె.ప్రసాద్ తెలిపారు.