
‘కూటమి’గా
న్యూస్‌రీల్
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన షాపుల్లో ‘కూటమి’ బినామీలు పాగా ప్రజాప్రతినిధుల డైరెక్షన్‌లో వేలంలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు సిండికేట్‌గా మారి ఇతరులు పాల్గొనకుండా చక్రం తిప్పుతున్న కూటమి నేతలు
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ కొల్లి శారద హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ షాపుల వేలం పాట ప్రహసనంగా మారింది. వేలంటపాట నిర్వహణ గత రెండు రోజులుగా ఇది కొనసాగుతోంది. షాపుల ద్వారా మంచి ఆదాయం వస్తున్న నేపథ్యంలో వాటిని దక్కించుకోవాలని కూటమి నేతలు పావులు కదిపారు. సోమ, మంగళవారాల్లో జరిగిన వేలం పాటల్లో కూటమికి చెందిన కార్పొరేటర్లు, నేతలు ఈ మేరకు చక్రం తిప్పారు. ఏకంగా నగర పాలక సంస్థ కార్యాలయంలోనే పాగా వేసి.. వేలం పాట దగ్గరుండి పరిశీలిస్తూ తమ బినామీల ద్వారా షాపులను దక్కించుకున్నారు.
దుకాణం తెరిచారు!
నెహ్రూనగర్ (గుంటూరు): కొల్లి శారద మార్కెట్‌లో 81 షాపులకుగాను వేలం పాట 18, 19, 20వ తేదీల్లో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం 29, మంగళవారం 26 దుకాణాలకు వేలం పాట నిర్వహించారు. బుధవారం మిగిలిన 26 షాపులకు పాట జరగనుంది. దుకాణాలలో వ్యాపారాలకు మంచి గిరాకీ ఉండటంతో వేలం పాటలో పాల్గొనేందుకు పోటీ పెరిగింది. 10 మంది నుంచి 20 మంది వరకు పోటీ పడేందుకు వచ్చారు. మరోవైపు వీటిపై కన్నేసిన ఓ మంత్రి వర్గం, ఇతర కూటమి ప్రజాప్రతినిధులకు చెందిన వారు రెండు రోజులపాటు చక్రం తిప్పారు. కార్పొరేషన్ కార్యాలయంలోనే పాగా వేసి నోట్ల కట్టలతో హడావుడి చేశారు. ఒక్కో షాపునకు సగటున రూ.7 వేలుగా ప్రభుత్వ అద్దెగా నిర్ణయించగా.. దానిని రూ.30 వేల నుంచి రూ.1,06,000 వరకు పెంచుకుంటూ పోయారు.
వేలం పాట వద్ద రభస
మంత్రి వర్గీయులు సోమవారం 7, మంగళవారం కూడా మరో 7 దుకాణాలు దక్కించుకున్నట్లు సమాచారం. బుధవారం మరో పది షాపులను తన బినామీల పేరిట కై వసం చేసుకునేందుకు ఎంతైనా వేలం పాట పాడే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. రిజర్వేషన్ల ప్రకారం షాపులు కేటాయించాలని నగర కమిషనర్ సూచించారు. ఆ ప్రకారం ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, బీసీలకు 4, దివ్యాంగులకు ఒకటి చొప్పున కేటాయించారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నేతలు ఆయా వర్గాల పేరుతో వేలం పాటలో పాల్గొన్నారు. మరోవైపు కావాలనే ఎక్కువ పాట పాడుతూ అద్దె పెంచేందుకు ప్రయత్నం చేశారు. మంగళవారం 31వ నంబర్ షాపును ఎస్సీలకు కేటాయించగా వేలం పాటలో ఇతర కులాల వారు వెనుక కూర్చొని పాట పెంచడం గమనించారు. వారిని బయటకు పంపించేయాలని అసలైన అర్హులు అక్కడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎస్సీలు కాని వారిని అధికారులు బయటకు పంపించేశారు. చివరికి ఆ షాపు వేలంపాటను సాయంత్రం అన్నీ అయ్యాక వేస్తామని అధికారులు చెప్పడంతో ఎస్సీలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీరియల్ ప్రకారం వస్తున్నప్పుడు అదే రీతిలో నిర్వహించకుండా ఇలా చెప్పడం ఏంటని మండిపడ్డారు. చేసేదేమీ లేక వేలం పాట కొనసాగించారు. దీనిని రూ.47 వేలకు ఎస్సీ వర్గం వారు పాడుకున్నారు.
రైతుల నెత్తిన ఎరువు బరువు
వైభవంగా వీరభద్రుడి పల్లె జాతర
నిజంగా చెల్లిస్తారా?
ఎవరైనా వేలం పాటలో పాల్గొనేందుకు వస్తుంటే పక్కకు తీసుకువెళ్లి సిండికేట్‌గా వారితో మాట్లాడుకుని కొంత డబ్బు ముట్టజెప్పి పంపించేస్తున్నారు. మార్కెట్‌లోని పాత లీజుదారులందరూ ఏటుకూరు, బుడంపాడు బైపాస్‌కు దుకాణాలు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మరో పక్క ఇంత ఖర్చుపెట్టి వేలం పాటలో వీరందరూ పాల్గొనడం చూసి అధికారులు కూడా కంగుతింటున్నారు. జీఎస్టీ, అడ్వాన్ కూడా భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కార్పొరేషన్‌కు జమ చేస్తారా? లేదా? అని అధికారులే ఒకింత అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రహసనంగా మారిన కొల్లి శారద మార్కెట్‌లోని షాపుల వేలంపాట
రూ. 1.6 లక్షలు పలికిన 43వ షాపు
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని కొల్లి శారద మార్కెట్ షాపుల వేలం పాట జరుగుతున్న విషయం విదితమే. మంగళవారం జరిగిన వేలం పాటలో అత్యల్పంగా 22ఏ దుకాణం రూ. 32 వేలు, అత్యధికంగా 35వ షాపు రూ.90 వేలు వేలంపాటలో పలికాయి. ఆ తర్వాత జరిగిన 43వ నెంబరు షాపునకు జనరల్ కేటగిరీలో ఓ వ్యక్తి ఏకంగా రూ. 1,06,000కు పాట పాడి దుకాణం దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తంలో పాట పాడడం ఇదే మొదటి సారి అని అధికారులు, వేలంపాటదారులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘కూటమి’గా

‘కూటమి’గా

‘కూటమి’గా