
బంగారు గొలుసు అప్పగింత
అద్దంకి రూరల్: బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు చైన్‌ను డిపో మేనేజర్ ఆ ప్రయాణికుడికి అందజేశారు. డీఎం తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు సమతా నగర్‌కు చెందిన ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం మంగళవారం అద్దంకి డిపోకు చెందిన బస్సులో అద్దంకి నుంచి ఒంగోలు బయలుదేరాడు. బస్సులో తన బంగారు గొలుసు పోగొట్టుకున్నాడు. ఈ విషయం గమనించి అద్దంకి డిపో మేనేజర్ రామ్మోహనరావుకు తెలియజేశారు. డీఎం వెంటనే సంబంధిత బస్సు డ్రైవర్‌కు ఫోన్ చేశారు. డ్రైవర్ బస్సును పరిశీలించగా 2 సవర్ల బంగారు చైన్ కనబడటంతో తీసుకువచ్చి డీఎంకు అందజేశారు.