
‘కృష్ణా’లో పెరుగుతున్న వరద ఉద్ధృతి
కొల్లిపర: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్, ఇతర జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. దీతో కృష్ణా నదికి సుమారుగా 5 లక్షల క్యూసెక్కులు వరద నీరు రాగా, మంగళవారం అధికారులు ఈ మేరకు దిగువకు వదిలారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తహసీల్దార్ జి.సిద్ధార్థ, ఎస్సై కోటేశ్వరరావులు తెలిపారు. మండలంలోని లంక గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 24 గంటల్లో కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. లంక గ్రామంలోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
జీజీహెచ్‌లో ఫిర్యాదుల బాక్సు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, హెచ్‌డీఎస్ కమిటీ సభ్యుడు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ ఫిర్యాదుల బాక్స్‌లో పది ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిపై హెచ్‌డీఎస్ కమిటీ చర్చించి, పరిష్కరించేందు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

‘కృష్ణా’లో పెరుగుతున్న వరద ఉద్ధృతి