
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
లక్ష్మీపురం: ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. హిందూ కళాశాల సెంటర్‌లో మంగళవారం ఫెడరేషన్ తరఫున ఆటో కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు షేక్.మస్తాన్‌వలి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు ఉపాధి చూపాలన్నారు. గుంటూరు జిల్లా ఆటోడ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మణరావు, గుంటూరు నగర ఆటోడ్రైవర్స్ యూనియన్ కార్యదర్శి జి.శంకర్ రావు, కె.కోటేశ్వరరావు, షేక్ ఖాసిం, అశోక్, షేక్ జానీ, వెంకటయ్య, సాంబయ్య, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.