
బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం
క్రోసూరు: మండలంలోని విప్పర్ల గ్రామంలోని ఎస్సీకాలనీ (గోవిందపురం)కు చెందిన బాలుడు రెండు మాసాల క్రితం మృతి చెందగా, బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి పోలీసుస్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన జరిగింది. ఎస్‌ఐ రవిబాబు తెలిపిన వివరాల మేరకు.. జూన్ నెల రెండవ తేదీన విప్పర్ల గ్రామానికి చెందిన ఎర్రగుండ్ల జోష్ణప్రకాశ్ (8) బావిలో పడి మృతి చెందాడు. అప్పుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెంది ఉంటాడనుకుని ఖననం చేశారు. పది రోజుల క్రితం మృతుడి తల్లి శ్రావణి తన కుమారుడిని చంపి బావిలో వేసారన్న అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని క్రోసూరు సీఐ రమేష్, ట్రైనీ ఎస్‌ఐ గోపిల పర్యవేక్షణలో గుంటూరు నుంచి వచ్చిన ఇద్దరు ఫోరెన్సిక్ వైద్యులు, తహసీల్దార్ వి.వి.నాగరాజు, వీఆర్వోల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు.
బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు మరణించిన
రెండు మాసాల అనంతరం పోస్టుమార్టం