
త్వరలో అనుబంధ విభాగాల నియామకాలు
నెహ్రూనగర్: ౖవెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, నియోజకవర్గ, డివిజన్ అనుబంధ విభాగాల నియామకాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌లు తెలిపారు. గుంటూరు నగరంలోని అంబటి రాంబాబును, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్‌ను వారి కార్యాలయాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు, పల్నాడు జిల్లాల అనుబంధ విభాగాల ఇన్‌చార్జి షేక్ మస్తాన్‌వలి మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లాతోపాటు, గుంటూరు పశ్చిమ, తెనాలి నియోజకవర్గాల అనుబంధ విభాగాల కమిటీల గురించి ప్రస్తావించారు. త్వరితగతిన కమిటీలు పూర్తి చేసేలా దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం కల్పించేలా పదవులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుతో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు.