
లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ సహాయం అవసరమైతే ఈ క్లినిక్‌ను సందర్శించాలని తెలిపారు. దీనికి ప్యానెల్ అడ్వకేట్‌గా పి.రాజేష్ లింగం, పారా లీగల్ వలంటీర్‌గా పి.శిరీషను నియమించారు. కార్యక్రమంలో సైనిక సంక్షేమ అధికారి ఆర్.గుణశీల, మాజీ సైనిక ఉద్యోగులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.