
కృష్ణా రివర్ క్రాస్ స్విమ్మింగ్ పోటీలు
తాడేపల్లిరూరల్: ఉండవల్లి అమరావతి కరకట్టపై గల ఆక్వా డెవిల్స్ అసోసియేషన్‌లో సిమ్మింగ్ కాంపిటేషన్‌ను ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపల్లి రామకృష్ణ మాట్లాడుతూ ఆడ్వా డెవిల్స్ ప్రాంగణంలో వున్న కృష్ణానదిలో ఓపెన్ వాటర్‌లో ప్రాక్టీస్ చేసి ప్రపంచంలోని పలు సముద్రాలను ఈదుతున్న క్వీన్ విక్టోరియా, ఆమె కుమారుడు స్టీఫెన్ కుమార్‌లు 1.5 కి.మీ. కృష్ణ రివర్ క్రాస్ స్విమ్మింగ్ కాంపిటేషన్‌లో పాల్గొన్నారని తెలిపారు. ప్రపంచంలోని ఏడు సముద్రపు చానల్స్‌లో భాగంగా రెండవది అయిన అమెరికాలోని మెయిన్ ల్యాండ్ నుంచి సౌత్ కాలిఫోర్నియా బీచ్ వరకు 33.5 కి.మీ స్విమ్మింగ్ చేయడానికి సెప్టెంబర్ నెలలో వెళ్తున్న సందర్భంగా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు సూచన మేరకు వారికి రూ. 25,116/– చెక్కును అందజేశారు. అసోసియేషన్ కార్యదర్శి వై.వి. రమేష్ కుమార్‌మాట్లాడుతూ క్వీన్ విక్టోరియా తన పిల్లలను ఈత శిక్షణ శిబిరంలో చేర్పించి, తాను కూడా పిల్లలతో పాటు ఈత నేర్చుకుని మాస్టర్ స్విమ్మింగ్‌లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆక్వా డెవిల్స్ ప్రాంగణంలో ఉన్న కృష్ణానదిలో ఓపెన్ వాటర్‌లో ప్రాక్టీస్ చేసి ప్రపంచంలోని సముద్రాలను ఈదుతున్న మొట్టమొదటి తెలుగు మహిళ మరియు ఆమె కుమారుడు ఆక్వా డెవిల్స్ గౌరవ సభ్యులు కావడం గర్వకారణమన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోపాలం సాంబశివరావు, సహాయ కార్యదర్శి ఎ.రామిరెడ్డి, కోశాధికారి కె.వి.రామయ్య, కార్యవర్గ సభ్యులు కె.సాంబశివరాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, కర్రిసాంబయ్య, పి.శ్రీనివాసులు, కె.ఆశీర్వాదం, అబ్దుల్ గఫూర్ తదితరులు క్వీన్ విక్టోరియా, స్టీఫెన్ కుమార్‌లను అభినందించారు.
ఈత పోటీల్లో ప్రతిభ చూపుతున్న తల్లీకుమారులు క్వీన్ విక్టోరియా, స్టీఫెన్ కుమార్‌లకు ఘనసన్మానం