
స్మార్ట్ మీటర్ల వ్యతిరేక ప్రతిజ్ఞను జయప్రదం చేయండి
లక్ష్మీపురం: ఈనెల 28వ తేదీన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా జరిగే ప్రతిజ్ఞ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి పిలుపునిచ్చారు. గుంటూరులోని పాతగుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 2000 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోరాటంలో ముగ్గురు రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి వంటి యువకిశోరాలు ప్రాణ త్యాగంతో 20 సంవత్సరాలు పాటు విద్యుత్ చార్జీలు పెంచడానికి పాలకులు భయపడ్డారన్నారు. నేడు సర్ చార్జీలు, ఇతర చార్జీల పేరుతో, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల గొట్టమని పిలుపు ఇచ్చారని, నేడు అదానీతో ఒప్పందం మూలానా దగ్గరుండి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలందరూ విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఆగస్టు 28వ తేదీన జరిగే విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ప్రతిజ్ఞ దినంగా పాటించాలన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, జిల్లా కోశాధికారి ఎం.సాంబశివరావు, జిల్లా కార్యదర్శిలు వై.నేతాజీ, జి.రమణ, బి.ముత్యాలరావు, నన్నపనేని శివాజీ, సిహెచ్ నాగ బ్రహ్మచారి, ఎస్‌ఎస్ చెంగయ్య, ఎం.భాగ్యరాజు, లక్ష్మి జిల్లా ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావు, వి.దుర్గారావు, ఎస్‌కే హుస్సేన్ వలి, కె.బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి