
మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి
పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
నరసరావుపేట: మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం డాట్ ఏపీ డాట్ జీవోవి డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 18వ తేదీన కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని పేర్కొన్నారు.
దంపతులకు తీవ్ర గాయాలు
యడ్లపాడు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలైన సంఘటన మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు బైక్‌పై భార్యాభర్తలు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఒక స్కూటీ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసం కావడంతోపాటు దంపతులిద్దరూ బైక్‌పై నుంచి కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు స్పందించి క్షతగాత్రులను చిలకలూరిపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.
ఇద్దరికి తీవ్రంగా..నలుగురికి స్వల్పంగా గాయాలు
పిడుగురాళ్ల: ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి గాయాలైన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని కళ్లం టౌన్‌షిప్ వద్ద చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సేకరించిన వివరాల మేరకు... మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామం నుంచి ఐదుగురు నరసరావుపేటలోని ఇస్కాన్ ఆలయానికి ఆటోలో బయలుదేరారు. మార్గంమధ్యలో ఈశ్వరమ్మ, సారంగమ్మలు అయ్యప్పనగర్ వద్ద ఆటో ఎక్కారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న కంటైనర్ లారీ ఆటోను ఢీకొంది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఈశ్వరమ్మ, సారంగమ్మలను 108 వాహనం ద్వారా, నామ్స్ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లో పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మోహన్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపైగల శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలోని ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన ఈ పూజల్లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ దంపతులు పాల్గొన్నారు. తొలుత గోమాతకు ఘనంగా పూజలు చేసిన అనంతరం శ్రీకృష్ణ భగవాన్‌కు పూజలు నిర్వహించారు. ఈ వేడుకల నిమిత్తం దేవస్థానం స్థానాచార్యులు, వైదిక కమిటీ, అర్చక బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా విశేష సౌకర్యాలు కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి దేవస్థాన పురాణ పండితులు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి ఉపన్యసించారు. అనంతరం మల్లికార్జున మహామండపం 7వ అంతస్తులో రాజగోపురం ముందు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.
ప్రమాదంలో గాయపడిన ఈశ్వరమ్మ, సారంగమ్మ

మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి

మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి