
ఎమ్మెల్యేలది ఓ దారి... ఎమ్మెల్సీది మరోదారి !
ఉచిత బస్సు ప్రారంభోత్సవంలో టీడీపీ నేతల మధ్య మనస్పర్ధలు
పట్నంబజారు: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఎడ మొహం.. పెడ మొహంగా ఉన్నారు. బస్సుల ప్రారంభోత్సవానికి గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎండీ.నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతోపాటు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయవాడ సెక్టార్ వైపు బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్లా మాధవిలు డిపో–2 పరిధిలో బస్సులను ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్న మేయర్ రవీంద్ర కూడా ఎమ్మెల్యేతో అంటీ ముట్టనట్లు వ్యవహరించారు. కనీసం ఆర్టీసీ బస్టాండ్‌లో గంటకు పైగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పలకరించుకోకపోవడం గమనార్హం. ఆర్టీసీ బస్టాండ్ వేదికగా వారి మధ్య మనస్పర్ధలు బయట పడ్డాయనే వాదనలు వినవస్తున్నాయి.

ఎమ్మెల్యేలది ఓ దారి... ఎమ్మెల్సీది మరోదారి !