గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ అసిస్టెంట్ సర్వీస్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర కోశాధికారిగా గుంటూరుకు చెందిన చప్పిడి అనిల్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర కోశాధికారిగా ఎన్నికై న అనిల్‌కుమార్‌ను నాన్‌గెజిటెడ్ వెటర్నరీ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ సేవానాయక్, జిల్లా చైర్మన్ రాజమోహన్, ఏపీఎన్‌జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ శ్యామ్ సుందర శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ షేక్ నాగూర్‌షరీఫ్, నగర అధ్యక్ష కార్యదర్శులు సూరి, కళ్యాణ్, ఇతర సంఘ నేతలు అభినందనలు తెలిపారు.
పశ్చిమ డెల్టాకు 6,908 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆదివారం 6,908 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కు 290, బ్యాంక్ కెనాల్‌కు 1,820, తూర్పు కాలువకు 664, పశ్చిమకాలువకు 285, నిజాంపట్నం కాలువకు 460, కొమ్మూరు కాలువకు 3,060 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యారేజి నుంచి సముద్రంలోకి 50,750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
మొక్కజొన్న వ్యాపారిని మోసం చేసిన తండ్రీకొడుకులు
తెనాలిరూరల్: మొక్కజొన్న, జొన్నల వ్యాపారం చేసే తండ్రీకొడుకులు నంద్యాలకు చెందిన వ్యాపారిని మోసం చేయడంపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ చెంచుపేటకు చెందిన గోగినేని సత్యనారాయణ, అతని కొడుకు శ్రీకాంత్ మొక్కజొన్న, జొన్నల వ్యాపారాలు చేస్తుంటారు. నంద్యాలకు చెందిన వ్యాపారి శ్రీనివాస్ వద్ద రూ.20 లక్షలు తీసుకుని సరుకు ఇవ్వకుండా మోసం చేశారు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ ఎస్‌ఐ కరిముల్లా తెలిపారు.
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
జె.పంగులూరు: మండలంలోని రేణింగవరం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పర్వతరెడ్డి వెంకటస్వామి (52) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. వెంకటస్వామి రేణింగవరం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతని స్వగ్రామం చిన్నగంజాం మండలం సోపిరాల. ఆయన అస్వస్థతకు గురికావడంతో ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటస్వామికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

లైవ్‌స్టాక్ యూనియన్ రాష్ట్ర కోశాధికారిగా అనిల్‌కుమార్