
బౌద్ధస్తూపం పరిరక్షణకు చర్యలేవీ?
భట్టిప్రోలు: భట్టిప్రోలులోని అతి ప్రాచీన బౌద్ధస్తూపం సరైన ఆలనాపాలన లేకుండా నిరాదరణకు గురవుతోంది. బుద్ధుని అస్థికలపై ఏర్పాటు చేసిన ఈ స్ధూపంపై చాలామంది కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు ఆటలాడుతున్నారు. దాదాపు 3 వేల సంవత్సరాల క్రితం భట్టిప్రోలు వాణిజ్య, విద్యా కేంద్రంగా విరాజిల్లింది. రాష్ట్రంలోని అన్ని బౌద్ధ స్తూపాల్లోకెల్లా ఇది అతి పురాతనమైనది.
మౌలిక వసతులు కరువు
బౌద్ధస్తూపం అభివృద్ధి పనులు ఎలా ఉన్నా.. దీనిని వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులకు కనీస సౌకర్యాలు కూడా లేవు. స్తూపం ముందు భాగంలో గార్డెనింగ్‌పై దృష్టి సారించిన పురావస్తు, ఆర్కియాలజీ శాఖాధికారులు వసతుల కల్పన విషయాన్ని విస్మరించడం శోచనీయం. ఇంత వరకు అండర్ పోర్షన్ మాత్రమే పూర్తయింది.
శిలాఫలకానికే పరిమితం
బౌద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని టీడీపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా భట్టిప్రోలును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 2016 మే 19న శ్రీకారం చుట్టింది. స్తూపం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (జేతవనం ప్రాజెక్ట్) ఆధ్వర్యంలో రూ.60 లక్షలతో 40 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహం, బోటు షికారు, తదితర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకం అలానే ఉంది. పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.
పాముల సంచారంతో భయం
బౌద్ధక్షేత్రం తిలకించేందుకు పర్యాటకులు వచ్చినప్పుడు పాములు కనిపించడంతో పరుగులు తీస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్షేత్రం నిర్వాహణపై అధికారుల పట్టింపు కరువైంది. ఆవరణ అంతా పిచ్చి గడ్డి పెరిగింది. వర్షం కురిస్తే ఆవరణలో భారీగా నీరు నిల్వ ఉంటోంది.
ఎంతో విశిష్టత కలిగిన భట్టిప్రోలు బౌద్ధ ఆరామం అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకుని పర్యాటక ప్రాంతం సందర్శకులకు కనీస వసతులు కూడా లేక ఇబ్బందులు