
వారి కష్టాలు చూసే ‘ఉచిత భోజనం’
గుంటూరు జీజీహెచ్‌కు ఐదు జిల్లాల రోగులు వైద్యం కోసం వస్తున్నారు. కరోనా సమయంలో రోగుల సహాయకులు భోజనం కోసం పడుతున్న అవస్థలు చూశాను. సహాయకులకు తృప్తిగా ఉచిత భోజనం పెట్టాలని ఆనాడే అనుకున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.
– మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు
ఇంటి భోజనంలా ఉంది
నేను వారం రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మా బంధువు బుజ్జి వద్ద ఉంటున్నాను. ఆసుపత్రిలో ఉచిత భోజనం పెడుతున్న విషయం తెలుసుకుని ఇక్కడే తింటున్నాను. ఇంటి భోజనంలా ఉంది. మధురాన్నం నిర్వాహకులకు ధన్యవాదాలు.
– పూనం వెంకట్రావు, భద్రాచలం
ఎంతో రుచికరం
నా కుమారుడు నరేంద్ర జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి వద్ద ఉంటున్న నాకు బయటకు వెళ్లి భోజనం కొనుక్కునే స్థోమత లేదు. ఆసుపత్రిలో ఉచిత భోజనం పెడుతున్నారని తెలుసుకుని, ఇక్కడ తింటున్నాను. భోజనం రుచికరంగా బాగుంది.
– చుక్కా పోలమ్మ, 113 త్యాళ్లూరు
●

వారి కష్టాలు చూసే ‘ఉచిత భోజనం’

వారి కష్టాలు చూసే ‘ఉచిత భోజనం’