
రూ.కోటి విరాళం ఇచ్చి మరీ..
పుణ్యకార్యం నిరంతరం కొనసాగేందుకు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు రూ.కోటి అందించారు. ప్రేమగా, రుచిగా భోజనం పెట్టేందుకు సొంత ట్రస్ట్ ‘మధురాన్నం’ ద్వారా సేవలు అందిస్తున్నారు. రోజూ రెండు పూటలా ఇక్కడ వంట వండుతున్నారు. రోజూ 1,000 –1,500 మందికి భోజనం పెడుతున్నారు. ఒకేసారి 300 మంది కూర్చుని తినొచ్చు. మధ్యాహ్నం 12 – 2, రాత్రి 7– 8.30 గంటల వరకు భోజనం పెడతారు. రోగులకు, వారి సహాయకులకు, వార్డులో పనిచేస్తున్న సిబ్బందికి ఉచిత పాస్ ఇస్తారు. ఈ పాస్ చూపితే జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ ఎదురుగా ఉన్న మధురాన్నం సొసైటీ భోజనశాలలో ఉచితంగా భోజనం పెడతారు. ఈ తరహా సేవా కార్యక్రమంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇక్కడ కొనసాగుతోంది. అన్నం, పప్పు, పచ్చడి, రసం, మజ్జిగ, సాంబారు, కూర వడ్డిస్తారు. పది మందికి పైగా సిబ్బంది ఇంటి భోజనాన్ని మరిపించేలా రుచికరమైన ఆహారాన్ని వండి పెడుతున్నారు. ప్రతినెలా సుమారు రూ. 10 లక్షల వరకు దీనికోసం మాజీ మంత్రి ఖర్చు పెడుతున్నారు.