
గిరిజన సంక్షేమానికి కృషి
గుంటూరు వెస్ట్: గిరిజనుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, మొహమ్మద్ నసీర్ అహ్మద్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు నాయుడు పాల్గొన్నారు. ఏకలవ్యుడు, సేవాలాల్ మహరాజ్, బి.ఆర్.అంబేడ్కర్, వెన్నలకంటి రాఘవయ్య, చెంచులక్ష్మి చిత్రపటాలకు నివాళులు అర్పించారు.