వైన్స్‌లోనూ ‘గేట్లు’ ఎత్తేశారు! | - | Sakshi
Sakshi News home page

వైన్స్‌లోనూ ‘గేట్లు’ ఎత్తేశారు!

Aug 8 2025 7:45 AM | Updated on Aug 8 2025 7:45 AM

వైన్స్‌లోనూ ‘గేట్లు’ ఎత్తేశారు!

వైన్స్‌లోనూ ‘గేట్లు’ ఎత్తేశారు!

సాక్షి ప్రతినిధి, గుంటూరు/నెహ్రూనగర్‌: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తోంది. మద్యమే ఆదాయ వనరుగా చూస్తూ ఎడాపెడా ప్రజలతో తాగించేందుకు కొత్తగా పర్మిట్‌ రూములు సిద్ధం చేస్తోంది. ఇందుకు గాను లైసెన్సీల వద్ద నుంచి రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు వసూలు చేసేందుకు నిర్ణయించింది.

తాగినోళ్లకు తాగినంత..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్వహించిన మద్యం దుకాణాలను కూటమి సర్కారు వచ్చాక రద్దు చేసింది. వాటి స్థానంలో ప్రైవేట్‌ వ్యక్తులు వైన్‌ షాపులు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది. జిల్లాలో 140 వైన్‌ షాపులకు అనుమతులు మంజూరు చేసింది. వీటి వద్ద అనధికారికంగా పర్మిట్‌ రూములు నిర్వహిస్తున్నారు. వాటిలో అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్నారు. వైన్‌ షాపు నిర్వాహకులు, నాయకులు, ఎకై ్సజ్‌ అధికారులు జేబులు నింపుకొంటున్నారు. ఈ నెలాఖారుకు ప్రస్తుతం బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు సంబంధించిన మద్యం పాలసీ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీలోగా నూతన మద్యం పాలసీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఇందులో భాగంగా గీత కులాలకు పదిశాతం బార్‌ నిర్వహణలో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 99 బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు మరో పది అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 25వ తేదీలోగా కొత్త మద్యం పాలసీకి సంబంధించిన బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు సంబంధించి లాటరీ ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్‌ 1 నుంచి నిర్వహించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో వైన్‌ షాపులకు సంబంధించి పర్మిట్‌ రూములు నిర్వహించుకునేందుకు అధికారిక ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. ఆదాయమే పరమావధిగా కూటమి ప్రభుత్వం వ్యహరించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.

ఆదాయమే పరమావధిగా..

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో బీర్లు 26.08 లక్షల బాక్సులు, లిక్కర్‌ 11.84 లక్షల బాక్సులు అమ్మకాలు జరిగాయి. దీని వలన ప్రభుత్వానికి ఆదాయంగా రూ.2,010 కోట్లు సమాకూరింది. ఇప్పటి వరకు అనధికారికంగా నిర్వహించిన పర్మిట్‌ రూముల స్థానంలో అధికారికంగా నిర్వహణకు అనుమతి ఇస్తే ఇక మద్యం ఏరులై పారడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.

ఇక పర్మిట్‌ రూమ్‌లకు కూడా అనుమతి మద్యం షాపుల వద్ద తాగేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ జిల్లా వ్యాప్తంగా 140 వైన్‌ షాపుల్లో అమలయ్యే అవకాశం బార్‌ అండ్‌ రెస్టారెంట్ల అనుమతుల ప్రక్రియ పూర్తయ్యాక అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement