
చేనేత రంగాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం
మంగళగిరి: మనదేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగంపై ఆధారపడి జీవించే కుటుంబాలు అధికమని, అలాంటి చేనేత రంగాన్ని కూట మి ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అన్నారు. గురు వారం జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రగడ కోటయ్య చిత్రపటానికి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హనుమంతరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో చేనేత షెడ్లు నిర్మించి 1500 కుటుంబాలకు ఉపాధి కల్పించడమే కాక చేనేత భవన్‌నం నిర్మించామన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతన్నల బాధలు గమనించి ఏడాదికి రూ.24 వేలు అందజేశారన్నారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టారన్నారు. కూటమి ప్రభుత్వం చేనేత రంగాన్ని విస్మరించిందని, ఫలితంగా కొన్ని కుటుంబాలు పూట గడవని పరిస్థితిలో ఉన్నాయన్నారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ కార్మికులను ఆదుకోవాలని కోరారు. పలువురు చేనేత కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, లీగల్ సెల్ నాయకులు కొసనం శ్రీనివాసరావు, పట్టణ గౌరవ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, చేనేత విభాగ నియోజకవర్గ అధ్యక్షుడు పూజాల మనోహర్, జిల్లా కార్యదర్శి దామర్ల కుభేరస్వామి, చేనేత విభాగం నాయకులు ఆకు రాతి శివభాస్కరరావు, గుంటి నవీన్, జిల్లా యాక్టివిటీ సభ్యురాలు మల్లవరపు సుధారాణి, రూ రల్, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడు మాతంగి బాబు, శుభకర్, నిర్మల, ఫిరోజ్ మాబు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు
వెఎస్సార్ సీపీ కార్యాలయంలో
జాతీయ చేనేత దినోత్సవం