
అధికారిక సమావేశం.. ఆయనకు ఏం పని?
తాడికొండ: తాడికొండ నియోజకవర్గంలో షాడో పెత్తనంపై అందరూ విస్మయం చెందుతున్నారు. పార్టీ కార్యాలయంలో చెలాయిస్తున్నాడు సరే ఇక్కడ కూడా ఇతని ఆదిపత్యం మాకు తప్పదా అంటూ పెదవి విరుస్తున్నారు తాడికొండ నియోజకవర్గ అధికారులు, పార్టీ నాయకులు. టీటీడీ సిఫార్సు లేఖలు, ట్రాన్స్‌ఫర్‌లు, అధికారులు చేయాల్సిన విధులు, బడ్జెట్ కేటాయింపులు అన్నింటా తానే అయి వ్యవహరిస్తున్న సదరు షాడో బత్తుల నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమీక్షలకే హాజరై హుకుం జారీ చేసేవాడు. కానీ ఇప్పుడు అది కాస్తా ముదిరి ఇప్పుడు నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమీక్షలో కూడా ఆయన గారి ప్రసన్నం అధికారులకు తప్పలేదు. సదరు షాడో సమీక్షకు హాజరు కాకూడదని తెలిసినా నేరుగా వచ్చి ముందు వరుసలో హాజరై ఆశీనుడయ్యారు. వచ్చిన అధికారులు కూడా చేసేదేమీ లేక ఆయనకు వంగి వంగి నమస్కరించడం మనకి ఇక్కడ కూడా ఈ ఖర్మ తప్పదా ఇదేమి చోద్యం అంటూ చెవులు కొరుక్కోవడం తప్పలేదు. ఇతగాడి వ్యవహార శైలిపై అధికార పార్టీలోనే పలు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల టీడీపీకి చెందిన వాట్సాప్ గ్రూపు ల్లో ఓ మెస్సేజ్ హల్‌చల్ చేసింది దాని పర్యావసానం ఏమిటంటే బ్యాంకులో గుమాస్తాగా ప్రస్థానం మొదలెట్టి సినిమా లెక్క ఇతను నియోజకవర్గం కాకున్నా నియోజకవర్గం మీద పడి రెచ్చిపోతున్నాడనే విమర్శలు లేకపోలేదు. . అతి తక్కువ కాలంలో వందల కోట్ల పోగేసిన ఈ రాజకీయ బ్రోకర్ చేసే ఆగడాలలో ఇది 0.01 శాతం మాత్రమే ఇతని చిట్టా మొత్తం ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు లోకేష్ గారి టీమ్ ద్వారా లోకేష్‌కి చేరుతూనే ఉంది. ఇతనికి తెలియకుండానే ఇతని దగ్గర లోకేష్ గారు మనుషు లును సైలెంట్‌గా ప్రవేశ పెట్టడం ఇతని కదలికలను ఎప్పటికప్పుడు రికార్డెడ్‌గా కేంద్ర కార్యాలయానికి చేరవేయడం నిరంతరంగా జరుగుతుంది. ప్రస్తుతం ఇతని కదలికల మీద 24 గంటల నిఘా ఉంది.
ఇతని వ్యక్తిగత ప్రయోజనాల కోసం పచ్చగా ఉండే పల్లెల్లో పార్టీని అడ్డగోలుగా గ్రూపులుగా విడగొట్టి ఆ గ్రూపులకు పార్టీ పదవులు, గ్రామాల్లోని కాంట్రాక్టు పనులను అమ్ముకుంటున్నాడు అని పూర్తి సమాచార పలు వివాదాస్పద వ్యవవహారాలను ఉదహరిస్తూ ఓ మెస్సేజ్ భారీగా హల్‌చల్ చేసింది. ఇంతా జరుగుతున్నా ఇతగాడిని పక్కన పెట్టకపోగా పక్కనే కూర్చోబెట్టుకోవడం వెనుక అంతరం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనేది వాదన.
కలెక్టరేట్‌లో జరిగిన అధికారుల
సమీక్షలో తాడికొండ షాడో బత్తుల హాజరుపై అధికారులు విస్మయం

అధికారిక సమావేశం.. ఆయనకు ఏం పని?