
ఘనంగా భూ వరాహస్వామి జయంతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై భూ వరాహస్వామి జయంతి ఉత్సవాలను వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనములతో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఈ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి రోజు బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ భూవరాహ హోమం, అష్టోత్తర శతనామార్చన, పూర్ణాహుతి, వేద ఆశీర్వచనం నిర్వహించామని పేర్కొన్నారు. స్వామి నారాయణ సంస్థ నుంచి స్వామిజీ మహారాజ్ సేవకులు శ్రీ నారాయణ చరణ్ స్వామి బృందంతో విచ్చేశారన్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.

ఘనంగా భూ వరాహస్వామి జయంతి