ఆరోగ్య సంరక్షణలో ఫార్మా రంగం కీలకం
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్
గుంటూరు మెడికల్: ఆరోగ్య సంరక్షణలో ఫార్మా రంగం ఎంతో కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ అన్నారు. శుక్రవారం గుంటూరు కేపిటల్ హోటల్‌లో బెంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఫార్మాటెక్ కన్వర్ట్ 2025 కార్యక్రమానికి వీరపాండియన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఫార్మా రంగం విశిష్టతను వివరించారు. గౌరవ అతిథి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య ట్రస్టు సీఈఓ పి.రవిశుభాష్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణలో ఫార్మా పాత్ర ఎంతో ఉందన్నారు. ఇంకా పలువురు వక్తలు ప్రసంగించారు.


