రేపటి నుంచి కందులు కొనుగోలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి కందులు కొనుగోలు

Jan 31 2025 2:15 AM | Updated on Jan 31 2025 2:15 AM

రేపటి నుంచి కందులు కొనుగోలు

రేపటి నుంచి కందులు కొనుగోలు

పల్నాడు, గుంటూరు జిల్లాల మార్క్‌ఫెడ్‌ డీఎం ఆర్‌జే కృష్ణారావు

కొరిటెపాడు(గుంటూరు): పల్నాడు జిల్లాలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కందులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని గుంటూరు, పల్నాడు జిల్లాల మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ ఆర్‌జే కృష్ణారావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రైతులు పండించిన కంది పంటను కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,550లకు నాఫెడ్‌ తరపున మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ముందుగా కందులు పండించిన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో సీఎం యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో 28 మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 202 మంది రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం జరిగిందని వెల్లడించారు. కోసిన కంది పంటను నూర్పిడి చేసి బాగా ఆరబెట్టి శుభ్రం చేసుకోవాలని, శుభ్రం చేసిన కందులలో తేమ శాతం 12 శాతం లోపు ఉండేట్లు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులు తమ కందులను తమ సొంత గోనె సంచులలోనే తమకు కేటాయించిన కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులు తమ కంది పంట ఈ–క్రాప్‌ బుకింగ్‌లో నమోదు అయినదో లేదో సంబంధింత రైతు సేవా కేంద్రంలో చూసుకోవాలన్నారు. ఈ–క్రాప్‌లో నమోదు కానటువంటి రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు. ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంక్‌ అకౌంట్‌ నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తో పాటు రైతు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు తీసుకురావాలని సూచించారు. ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంక్‌ ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయనున్నట్టు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement