గురువుపై మూల్యాంకన బరువు | - | Sakshi
Sakshi News home page

గురువుపై మూల్యాంకన బరువు

Aug 12 2025 7:45 AM | Updated on Aug 12 2025 7:45 AM

గురువుపై మూల్యాంకన బరువు

గురువుపై మూల్యాంకన బరువు

తరగతులవారీగా పరీక్షలు ● 1, 2వ తరగతుల విద్యార్థులు తెలుగు, ఇంగ్లిషు, గణితం పరీక్షలు రాయాల్సి ఉంది. 3,4,5వ తరగతలకు వీటికి అదనంగా సైన్స్‌ పరీక్ష జరుగుతుంది. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒకరిద్దరు చొప్పున ఉన్న ఉపాధ్యాయులకు ఆయా పరీక్షల నిర్వహణ పెనుభారంగా మారింది. వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఇది తలకు మించిన భారంగా మారుతోంది. ● అసెస్‌మెంట్‌ పుస్తకంలో విద్యార్థులు తమ అపార్‌ నంబర్‌, పరీక్ష కోడ్‌ రాసి బబ్లింగ్‌ చేయాలి. పుస్తకంలో జవాబులు రాయడంతోపాటు అందులో పొందుపర్చిన ఓఎంఆర్‌ షీట్‌లో సరైన సమాధానాలకు బబ్లింగ్‌ చేయాలి. ఉపాధ్యాయులకు కష్టాలు

అందరికీ పెనుభారం

విద్యార్థులు, ఉపాధ్యాయుల జీవితాలతో కూటమి సర్కార్‌ ఆటలు

పరీక్షల సంస్కరణల పేరుతో తెరపైకి

అసెస్‌మెంట్‌ పుస్తకాలు

ఎఫ్‌ఏ–1 పరీక్షల నుంచి అమల్లోకి తెచ్చిన విద్యాశాఖ

జవాబులు రాసేందుకు పేపర్లకు బదులు పుస్తకాలు పంపిణీ

అన్ని పాఠ్యాంశాలకు ప్రత్యేక పుస్తకంలో విద్యార్థుల సమాధానాలు

బడుల్లోనే మూల్యాంకనం చేయాల్సి రావడంతో బోధనపై ప్రభావం

పాత సమాధానాలు చూసి తర్వాత పరీక్షలో విద్యార్థులు రాసే అవకాశం

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు విద్యాశాఖ విషయంలో కూటమి సర్కారు తీరు ఉంది. అర్థంపర్థం లేని నిర్ణయాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులపై పెనుభారం మోపింది. అసెస్‌మెంట్‌ పుస్తకాలు అంటూ కొత్త పరీక్షల విధానం తీసుకొచ్చి సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు మరింత దిగజారుస్తోంది. దీనిపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ–1) పరీక్షల్లో అమల్లోకి తెచ్చిన అసెస్‌మెంట్‌ బుక్స్‌ గందరగోళానికి తెర తీశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. విద్యాసంవత్సరం పొడవునా నిర్వహించే ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షల ప్రశ్నలకు జవాబులు రాసేందుకు విద్యార్థులకు ఇస్తున్న ఆన్సర్‌ షీట్‌ విధానంలో మార్పులు చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కొత్తగా అసెస్‌మెంట్‌ బుక్‌ను ప్రవేశపెట్టింది. గుంటూరు జిల్లాలోని 965 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి టెన్త్‌ వరకు 90 వేల మంది విద్యార్థులకు ఈ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ పుస్తకాలకు మూల్యాంకనం నిర్వహించడం ఉపాధ్యాయులపై పెనుభారంగా మారనుంది. సింగిల్‌ టీచర్‌ ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో గురువులకు ఇబ్బంది తప్పదు. అలాగే ఉన్నత పాఠశాలల్లో వందల మంది విద్యార్థులు ఉంటే మూల్యాంకనానికే రోజుల తరబడి సమయం పడుతుంది. 450 మంది విద్యార్థులు ఉన్న హైస్కూళ్లలో హిందీ సబ్జెక్టు బోధనకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండటంతో పేపర్‌ కరెక్షన్‌కు 10 రోజుల సమయం పట్టనుంది. అధిక బరువు కారణంగా మూల్యాంకనం పాఠశాలలోనే చేయాల్సి ఉంది. ఫలితంగా సిలబస్‌ బోధించేందుకు ఇబ్బందులు తప్పవు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకనానికి అధిక సమయం తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బోధనపై దృష్టి సారించేందుకు సమయం సరిపోని పరిస్థితి ఉంటుంది. మరోవైపు హోలిస్టిక్‌ కార్డులను కూడా పూరించాలి.

అసెస్‌మెంట్‌ బుక్స్‌ విధానం గందరగోళంగా ఉంది. విద్యార్థుల్లో స్వయం ఆలోచన, సృజనాత్మతను దూరం చేసేలా పరీక్షల నిర్వహణ ఉంది. మూల్యాంకనంలో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. పుస్తకాలను రద్దు చేసి, పూర్వ విధానంలోనే పరీక్షలు నిర్వహించాలి. ఎఫ్‌ఏ పరీక్షలకు రాసిన సమాధానాలు అదే పుస్తకంలో చూసి ఎస్‌ఏ పరీక్షలకు కూడా రాసే పరిస్థితి ఉంది.

– కె. బసవ లింగారావు,

ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

ఎఫ్‌ఏ –1, ఎఫ్‌ఏ –2 పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల్లో పునరావృతం అయ్యే అవకాశాలున్నాయి. ఎఫ్‌ఏ పరీక్షలకు రాసిన జవాబులు పుస్తకంలోనే ఉండటంతో తిరిగి వాటినే చూసి రాసేందుకు వీలుంటుంది. తద్వారా విద్యార్థులకు నష్టం కలగనుంది. ఈ పుస్తకాలను విద్యాసంవత్సరం పొడవునా పాఠశాలల్లో భద్రపర్చడం సమస్యగా మారనుంది. అవసరమైన సదుపాయాలు చాలాచోట్ల లేవు. ఏ ఒక్క పుస్తకం పోయినా విద్యార్థికి సమస్యగా మారనుంది. సంస్కరణల పేరుతో తీసుకున్న ఈ నిర్ణయంపై ముందుగా ఉపాధ్యాయులకు కనీసం అవగాహన కల్పించలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ తరహా నిర్ణయాలను విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులపై బలవంతంగా రుద్దడం తగదన్నారు. దీనిపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement