రెండు ప్రంచ యుద్ధాలను చూసిన బామ్మ! చివరి క్షణాల్లో.. | Sakshi
Sakshi News home page

రెండు ప్రంచ యుద్ధాలను చూసిన బామ్మ! చివరి క్షణాల్లో..

Published Wed, Dec 13 2023 11:20 AM

Worlds Second Oldest Woman Aged 116 Dies - Sakshi

జపాన్‌ అత్యధిక ఆయుర్దాయం కలిగిన మానవులకు నిలయంగా వార్తలకెక్కిన సంగతి తెలిసందే. ఇంతకు ముందు ఆ దేశంలో పలువురు వ్యక్తులు దీర్ఘకాలం జీవించిన వ్యక్తులుగా రికార్డులు సృష్టించారు కూడా. అలా అత్యంత దీర్ఘకాలం బతికిన రెండో వ్యక్తిగా ఓ బామ్మ కూడా ఉంది. ఆమెకు 116 ఏళ్ల వయసు. ఆమె మంగళవారం తనకెంత ఇష్టమైన ఫుడ్‌ బీన్-పేస్ట్ జెల్లీని తిని తుది శ్వాస విడించినట్లు జపాన్‌ పేర్కొంది. ఆ బామ్మ పేరు ఫుసా టట్సుమీ. ఒసాకాలోని కాశీవారా నగరంలో ఓ ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఉంటుంది. ఫుసా టట్సుమీ మరణించినట్లు అక్కడి అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం. 

జపాన్‌ చరిత్రలో 116 ఏళ్ల వయసుకు చేరుకున్న ఏడవ జపనీస్‌ వ్యక్తిగా ఫుసా టట్సుమీ బామ్మ నిలిచింది. సరిగ్గా 2022 ఏప్రిల్‌లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్సు ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఆమెను అధికారికంగా ప్రకటించడం విశేషం. గతేడాది జపాన్‌లో 119 ఏళ్ల కేన్‌ తనకా మరణించిన తర్వాత జపాన్‌లో రెండొవ అత్యంత వృద్ధ బామ్మగా ఈ ఫుసా టట్సుమీ గుర్తింపు పొందింది. టట్సుమీ బామ్మ రెండు ప్రపంచ యుద్ధాలను, విపత్తులను, కరోనా వంటి మహమ్మారీలను చూసింది. ఆమె భర్త ఓ రైతు. వారికి ముగ్గురు సంతానం. ఆమె నర్సింగ్‌ హోమ్‌ చేరేంత వరకు చాలా ఆరోగ్యంగా తోటపని, వ్యక్తిగత పనులు చాలా చలాకీగా చేసుకుంది.

సరిగ్గా 70 ఏళ్ల వయసులో తొడ ఎముక విరిగి అనారోగ్యం పాలవ్వడం తప్పించి అంతకమునుపు ఆమెకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. 106 ఏళ్ల వయసులో వృద్ధాశ్రమానికి చేరే వరకు అన్ని పనులు చకచకా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచేది. గత కొన్ని రోజుల నుంచే నర్సింగ్‌ హోమ్‌లో ఉండటం జరిగింది. అక్కడ కూడా ఉద్యోగలందర్నీ పలకరిస్తూ ఉత్సాహంగా ఉండేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఒసాకా గవర్నర్ హిరోఫుమి యోషిమురా సైతం ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. గత నెల సెప్టెంబర్‌లో జరిగిన టట్సుమీ పుట్టిన రోజుల వేడుకలను ఆయన గుర్తు చేసుకుంటూ ఆమె కడవరకు ఎంత ఆరోగ్యంగా ఉందో స్వయంగా చూశానని, ఆమెలా అందరూ ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తే దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించగలుగుతారని అన్నారు. 

(చదవండి: జుట్టు లేకపోయినా మోడల్‌గా రాణించి శభాష్‌ అనిపించుకుంది! హెయిర్‌లెస్‌ మోడల్‌గా సత్తా చాటింది)


 

 
Advertisement
 
Advertisement