బట్టతలకు విరుగుడు మంత్రం! ఇది తొడుక్కుంటే చాలు..

The Worlds 1st Smart Wearable to Reverse Common Hair - Sakshi

బట్టతల మీద జుట్టు మొలిపించుకోవడం కోసం జనాలు నానా తంటాలు పడుతుంటారు. జుట్టు రాలడాన్ని అరి కట్టడానికి రకరకాల నూనెలను ఉపయోగిస్తుంటారు. మందు మాకులు వాడుతుంటారు. బట్టతలను దాచుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కొందరు విగ్గులు వాడుతుంటారు. బట్టతలపై జుట్టు కోసం ఇకపై ఇన్ని తంటాలు అక్కర్లేదు. హెల్మెట్‌లా కనిపించే ఈ పరికరాన్ని తలకు తొడుక్కుంటే చాలు. ఆరు నెలల్లోనే ఇది ఫలితాలను చూపించడం మొదలుపెడుతుంది.

ఆస్ట్రియాకు చెందిన ‘నియోస్టెమ్‌’ కంపెనీ ఇటీవల ఈ పరికరాన్ని ‘హెయిర్‌లాస్‌ ప్రివెన్షన్‌ వెయిరబుల్‌’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. రోజూ అరగంట సేపు దీన్ని తలకు తొడుక్కుంటే, ఇది తలపైనున్న మూలకణాలను ఉత్తేజితం చేసి, జుట్టు రాలిపోయిన చోట తిరిగి జట్టు మొలిపిస్తుందని దీని తయారీదారులు చెబుతున్నారు. దీనిని వాడటం వల్ల దుష్ఫలితాలేవీ ఉండబోవని కూడా వారు చెబుతున్నారు. దీని ధర 899 డాలర్లు (రూ.74,734). 

(చదవండి: ఆ గ్రామం పూల రాజధాని! అక్కడ ఎటు చూసినా..)

 

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top