ఆ గ్రామం పూల రాజధాని! అక్కడ ఎటు చూసినా..

Flower Capital Of The World Town Aalsmeer  - Sakshi

ఆ గ్రామంలో ఎటు చూసినా రంగు రంగుల పూలు కనువిందు చేస్తాయి. ఏ వీథిలోకి వెళ్లినా పూల పరిమళాలు మనసును ఆహ్లాదపరుస్తాయి. ప్రపంచ పూల రాజధానిగా పేరు పొందిన ఆ గ్రామం నెదర్లాండ్స్‌లో ఆమ్‌స్టర్‌డామ్‌కు చేరువలో హార్లెమ్‌ సరస్సు తీరంలో ఉంది. ఆల్‌స్మీర్‌ అనే ఈ ఊరు నలువైపులా పూలతోటలు, వీథుల్లో పూల దుకాణాలు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి పూలు భారీ ఎత్తున దేశ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.

ఈ గ్రామస్థుల్లో అత్యధికులు పూలరైతులు. గిట్టుబాటు ధర కోసం ప్రతిరోజూ వేలం నిర్వహిస్తుంటారు. ‘రాయల్‌ ఫ్లోరా హాలండ్‌ ఫ్లవర్‌ ఆక్షన్‌’ కేంద్రంగా ఈ పూల వేలంపాటలు జరుగుతుంటాయి. దేశ విదేశాలకు చెందిన వర్తకులు ఇక్కడి నుంచి పూలను టోకున తీసుకువెళుతుంటారు. గత శతాబ్ది తొలినాళ్లలోనే ఆల్‌స్మీర్‌ పూలసాగుకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ గ్రామంలో దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో పూల వేలంశాల ఉంది. ఇక్కడ ముప్పయివేలకు పైగా పూల రకాలు దొరుకుతాయి. ప్రతిరోజూ సగటున 48 లక్షల పూలమొక్కలు ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఏటా జరిగే ఫ్లవర్‌ పరేడ్‌ను తిలకించడానికి పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు వస్తుంటారు.  

(చదవండి: నేలమీది తారక: పువ్వు కాదు.. పుట్టగొడుగు!)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top