Instrument
-
Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం
నగరంలో సంగీత వాయిద్యాలలో ప్రావీణ్యం సంపాదించడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతోంది. సెలవుల్లో అందివచ్చిన సమయాన్ని సది్వనియోగం చేసుకునే క్రమంలో మ్యూజిక్‌కి జై కొడుతున్నారు స్టూడెంట్స్.. ముఖ్యంగా కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయం సంగీత వాయిద్యాల సాధనను ఎంచుకోవడానికి లేదా తిరిగి తమ అభిరుచులను సానబట్టడానికి దారితీసింది. అదే సమయంలో ఆన్లైన్ అభ్యాస వేదికలు విరివిగా అందుబాటులోకి రావడం ఈ అభిరుచికి ఆజ్యం పోసింది. దీని వలన విద్యార్థులు ఇంట్లో నుంచి కదలకుండానే వాయిద్యాలను నేర్చుకోవడం సులభమైంది. -సాక్షి,సిటీబ్యూరో ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో సంగీత శైలులపై అవగాహన పెరిగింది. వాయిద్యాల సాధనపై ఆసక్తికి పాశ్చాత్య సంగీతానికి పెరుగుతున్న ఆదరణ కూడా కారణమే. రాక్, పాప్, జాజ్ వంటి పాశ్చాత్య శైలులకు పెరుగుతున్న ప్రజాదరణ గిటార్లు, కీబోర్డులు, డ్రమ్స్ వంటి వాయిద్యాలకు డిమాండ్ పెంచింది. అదేవిధంగా కొరియన్ పాప్ కల్చర్ పట్ల పెరుగుతున్న మోజు కూడా మరో కారణం. పాశ్చాత్య వాయిద్యాలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, ముఖ్యంగా ఫ్యూజన్ సంగీతాన్ని అన్వేషించే యువతలో భారతీయ శాస్త్రీయ వాయిద్యాలపైనా బలమైన ఆసక్తి ఉంది.సాధనకు సరైన సమయం.. తల్లిదండ్రులు సంగీత విద్య ప్రయోజనాలను గతంలో కన్నా ఎక్కువగా తెలుసుకున్నారు. వేసవి సెలవుల్లో తమ పిల్లలను అర్థవంతమైన కార్యకలాపాల్లో నిమగ్నం చేయడంలో సంగీతాన్ని మించింది లేదని భావిస్తున్నారు. విద్యార్థులకు అత్యంత ఆసక్తి ఉన్న వాయిద్యం కీబోర్డ్ కాగా ఆ తర్వాత స్థానాల్లో గిటార్, డ్రమ్స్, వయోలిన్, పియానోలు ఉన్నాయి. ఇక గాత్ర శిక్షణ పట్ల కూడా ఆసక్తి పెరుగుతోంది.పరికరం.. ఆరోగ్యకరం..సంగీత వాయిద్యం పలికించడం ద్వారా మెదడు ఆరోగ్యం బలోపేతమై ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి పనితీరుపై సానుకూల ప్రభావాలను చూపుతుందని, అభ్యాస ఆసక్తిని మరింత ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎక్సెటర్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనంలో సంగీత వాయిద్యం వాయించడం తదుపరి జీవితంలో మెరుగైన మెదడు ఆరోగ్యం ఏర్పడటం మధ్య సంబంధం ఉందని కనుగొంది. సంగీతానికి విశ్రాంతి కలిగించే శక్తి ఉంది. అందుకే చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళన చెందుతున్నప్పుడు వాయిద్యం వాయించడం వైపు మొగ్గు చూపుతారు. ఫ్లూట్ నేర్చుకుంటున్న నగరానికి చెందిన ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యారి్థని లక్ష్మీ ‘వేణువు ఒక మధురమైన విశ్రాంతినిచ్చే వాయిద్యం’ అంటోంది. వేణువు వాయించడం మానసిక ఉద్రిక్తతను తగ్గిస్తుందని ఆమె చెప్పింది. ప్రతిరోజూ అరగంట సాధన చేస్తానని.. అది తన చదువుపై మరింత దృష్టి పెట్టడానికి సహాయ పడిందని చెప్పింది. వాయిద్యం వాయించడం భావోద్వేగ వ్యక్తీకరణకు సహాయపడుతోంది. భావోద్వేగాలకు ఒక మార్గాన్ని అందించడం ద్వారా ఆందోళనను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది అని మానసిక వైద్యులు డా.పరమేష్ వివరించారు. ఇదీ చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?వేసవిలో సంగీత ప్రయాణం చదువుకునే ఒత్తిడి లేని వేసవిలో విద్యార్థులు సంగీత ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా మంది. ఇది సరైన ప్రారంభంగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా, ప్రస్తుత సంగీత వేసవి కోర్సులు సాధారణ పాఠ్యాంశాల్లో అనుసంధానించడానికి అనుకూలంగా రూపొందిస్తున్నారు. ఇది స్కూల్స్/కాలేజీలు ప్రారంభింన తర్వాత కూడా విద్యార్థులు ఎటువంటి అంతరాయం లేకుండా సాధన కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. – లక్ష్మీనారాయణ యేలూరి, వ్యవస్థాపకులు ముజిగల్ అకాడమీ గిటార్ సాధన చేస్తున్నా.. పాశ్చాత్య సంగీతం అంటే ఇష్టం. రాక్ బ్యాండ్స్ ప్రదర్శనలకు హాజరవుతుంటాను. మంచి రాక్ బ్యాండ్ లో చేరాలని ఆలోచన ఉంది. అయితే కాలేజీలో క్లాసెస్ ఉన్నప్పుడు కుదరదు కాబట్టి.. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసెస్‌లో గిటార్ నేర్చుకుంటున్నా. – విప్లవ్, విద్యార్థి మణికొండచదవండి: Vaibhav Gautam వైకల్యానికి ‘చెక్’ పెట్టాడు! -
నాడు కన్నతండ్రే వద్దనుకుని విసిరేశాడు.. కట్‌చేస్తే ఆ చిన్నారే నేడు ఇలా..!
నేటికి కూతురు అనంగానే భారంగానే భావిస్తున్నారు పలువురు. విద్యావంతులైన వాళ్లు సైతం ఇదేతీరులో ప్రవర్తించడం బాధకరం. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతున్న 'ఆడపిల్ల' అనే వివక్ష విషయంలో మాత్రం మార్పు అంతంత మాత్రమే అనేది పలువురు సామజికవేత్తల వాదన. ఇలాంటి భావంతోనే ఓ తండ్రి నెలల పసికందు అని చూడకుండా కిటికిలోంచి విసిరేశాడు. సమయానికి పొరుగింటివాళ్లు స్పందించి కాపాడిన ఆ ప్రాణం..నేడు కనివినీ ఊహించని రీతిలో సంగీత విద్వాంసురాలిగా రాణించడమే కాదు రికార్డులు సృష్టిస్తోంది. ఆ అమ్మాయే నియాతి చెట్రాన్ష్. ఆమెకు కేవలం నెలల వయసులో ఆమె తండ్రి కర్కశంగా కూతురు కుటుంబానికి భారమని కిటికీలోంచి విసిరేశాడు. ఆ దుశ్చర్యకు ఆ చిన్నారి తల్లిప్రాణం తట్టుకోలేకపోయింది. తక్షణమే ఆ తల్లి కట్టుకున్న భర్తను వద్దనుకుని అన్నీతానై పెంచాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. తాను ఈ ప్రపంచం తీరు మార్చలేకపోవచ్చు కానీ తన కుమార్తెను మాత్రం కాపాడుకోగలను అనుకుంది. ఇక అలా ఆమె తన కూతురు నియాతికి అన్నీతానై ప్రేమగా పెంచుకుంటోంది. ఇక నియాతికి పెరిగేకొద్దీ సంగీతం పట్ల మక్కువ ఏర్పడటం మొదలైంది. ఆ ఇష్టమే ఆమెను జస్ట్ 12 ఏళ్లకే 42 వాయిద్యాలను వాయించే రేంజ్‌కి తీసుకొచ్చింది. ఆ ప్రతిభ ప్రతిఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అలా అనతి కాలంలోనే ఆమె పేరు, టాలెంట్ అందరికి తెలియడం మొదలైంది. దాంతో ఆ చిన్నారి తల్లి ఉద్యోగాన్ని వదిలి.. ఫ్రీలాన్స్ర్గా పనిచేస్తూ.. కుమార్తె అభిరుచిని కొనసాగించడంలో సహాయపడింది. ఆమె తల్లి ప్రోత్సహాంతో నియాతి జాతీయ అంతర్జాతీ సవేదికలపై ప్రదర్శనలు ఇస్తూ..రికార్డుల సృష్టించడం మొదలుపెట్టింది. అంతేగాదు కేవలం 65 సెకన్లలో 15 వాయిద్యాలపై మన జాతీయ గీతాన్ని వాయించి, ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో స్థానం సంపాదించింది. ఇవేగాక 13 నిమిషాలకు పైగా కళ్ళకు గంతలు కట్టుకుని శివ తాండవమ్ను కూడా ప్రదర్శించింది.ఎలా ఈ రంగాన్ని ఎంచుకుందంటే..నియాతి ఆరునెలల వయసులో తల్లి ఇచ్చిన బొమ్మ కీబోర్డ్‌ను చాలా ఆసక్తికరంగా వాయించే ప్రయత్నం చేసేది. అంతేగాదు వంటగదిలోని పాత్రలను ఒక లయబద్ధంగా కొట్టేది. అలా ఐదేళ్లు వచ్చేసరికి లండన్‌లోని ట్రినిటీ కాలేజీలో గ్రేడెడ్ పియానో పరీక్షలు రాసింది. ఉకులేలే, ఫ్లూట్, తబలా వంటి 16 విభిన్న వాయిద్యాలను వాయించడం నేర్చుకుంది. పైగా నియాతి తన తల్లే తనకు గొప్ప రోల్‌మోడల్ అని ఆమె అందించిన ప్రోత్సాహంతో పేరుప్రఖ్యాతలు తీసుకురావడం తన కర్తవ్యమని సగర్వంగా చెబుతోంది. నిశబ్దంగా ఉసురు తీయాలనుకున్న వారికి మనసుకు హత్తకునే మ్యూజిక్‌తో సమాధానమిస్తానంటోంది. (చదవండి: View this post on Instagram A post shared by The Better India (@thebetterindia)(చదవండి: రూ. 8 లక్షలు విలువ చేసే స్నాక్బ్రాండ్! ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..) -
World Piano Day: తొలి పియానోను ఎక్కడ భద్రపరిచారు?
నేడు (మార్చి 29).. ప్రపంచ పియానో దినోత్సవం(World Piano Day). పియానోను సంగీత కచేరీలలో ఉపయోగిస్తుంటారు. ఈ వాయిద్య పరికరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పియానోకు సంబంధించిన విషయాలు చాలామందికి తెలియవు. పియానో దినోత్సవం సందర్భంగా ఈ సంగీత పరికరానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.పియానోను తొలిసారిగా 1709లో ఇటలీకి చెందిన హార్ప్సికార్డ్ తయారీదారు బార్టోలోమియో డి ఫ్రాన్సిస్కో క్రిస్టోఫోరీ కనుగొన్నారు. ఆయన రూపొందించిన పియానోలలో ఒకటి న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్(Metropolitan Museum of Art)లో భద్రపరిచారు. పియానో అనేది పియానోఫోర్ట్ అనే పదానికి సంక్షిప్త రూపం. పియానో అంటే మృదువైన, ఫోర్డ్ అంటే బిగ్గరగా.. దీని అర్థం ఏమిటంటే ఈ రెండు రకాల శబ్ధాలను పియానోపై పలికించవచ్చు.తొలినాళ్లలో పియానోలు చాలా ఖరీదైనవిగా ఉండేవి. వీటిని దాదాపు ఒక శతాబ్దం పాటు ఒక నిర్దిష్ట తరగతికి చెందినవారు మాత్రమే కొనుగోలు చేయగలిగేవారు. నూతన పియానోను దాని కొత్త వాతావరణానికి, మారుతున్న రుతువులకు అనుగుణంగా ట్యూన్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఏడాదికి రెండుసార్లు ట్యూనింగ్(Tuning) చేస్తారు. పియానోలో మొత్తం 88 నలుపు రంగు, తెలుపు రంగు కీలు ఉంటాయి. పియానో క్లిష్టమైన వాయిద్య పరికరం. దీనిలో 12 వేలకు పైగా విడి భాగాలు ఉంటాయి.ప్రపంచంలో అతిపెద్ద పియానో 1.4 టన్నుల బరువు, 5.7 మీటర్ల పొడవు కలిగివుంది. దీనిని న్యూజిలాండ్ పియానో ట్యూనర్ అడ్రియన్ మాన్ రూపొందించారు. పియానో రెండు విధాలుగా ధ్వనిని అందిస్తుంది. మొదటిది బిగ్గరగా, రెండవది మెల్లగా ఉంటుంది. ఈ రెండు శబ్దాలు సరైన క్రమంలో ఉత్పత్తి అయినప్పుడు, శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. పియోనాను కీబోర్డ్ ఆధారంగా రూపొందిస్తుంటారు. దీనిలో ఏదైనా కీని గట్టిగా నొక్కితే పెద్ద శబ్దం వస్తుంది, అదే కీని మెల్లగా నొక్కినప్పుడు మృదువైన శబ్దం వస్తుంది.ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీ తెలివైన వ్యక్తి’.. భారత్ సుంకాలపై స్పందించిన ట్రంప్ -
బట్టతలకు విరుగుడు మంత్రం!
బట్టతల మీద జుట్టు మొలిపించుకోవడం కోసం జనాలు నానా తంటాలు పడుతుంటారు. జుట్టు రాలడాన్ని అరి కట్టడానికి రకరకాల నూనెలను ఉపయోగిస్తుంటారు. మందు మాకులు వాడుతుంటారు. బట్టతలను దాచుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కొందరు విగ్గులు వాడుతుంటారు. బట్టతలపై జుట్టు కోసం ఇకపై ఇన్ని తంటాలు అక్కర్లేదు. హెల్మెట్‌లా కనిపించే ఈ పరికరాన్ని తలకు తొడుక్కుంటే చాలు. ఆరు నెలల్లోనే ఇది ఫలితాలను చూపించడం మొదలుపెడుతుంది. ఆస్ట్రియాకు చెందిన ‘నియోస్టెమ్’ కంపెనీ ఇటీవల ఈ పరికరాన్ని ‘హెయిర్‌లాస్ ప్రివెన్షన్ వెయిరబుల్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. రోజూ అరగంట సేపు దీన్ని తలకు తొడుక్కుంటే, ఇది తలపైనున్న మూలకణాలను ఉత్తేజితం చేసి, జుట్టు రాలిపోయిన చోట తిరిగి జట్టు మొలిపిస్తుందని దీని తయారీదారులు చెబుతున్నారు. దీనిని వాడటం వల్ల దుష్ఫలితాలేవీ ఉండబోవని కూడా వారు చెబుతున్నారు. దీని ధర 899 డాలర్లు (రూ.74,734). (చదవండి: ఆ గ్రామం పూల రాజధాని! అక్కడ ఎటు చూసినా..) -
మొక్కల సంగీతాన్ని వినొచ్చు తెలుసా!
మొక్కలకు, చెట్లకు అనుభూతులు ఉంటాయి. వాటిలో అవి సంభాషణలు జరుపుకుంటాయి అని శాస్త్రవేత్తలు ఇదివరకే కనుగొన్నారు. మొక్కలు సంగీతాన్ని కూడా ఆలపిస్తాయి. అయితే వాటి సంగీతం మన చెవులకు సోకదు. మొక్కల సంగీతాన్ని వినగలిగే పరికరాల తయారీ దిశగా శాస్త్రవేత్తలు కొంతకాలంగా కృషి సాగిస్తున్నారు. అందులో భాగంగానే స్వీడన్‌కు చెందిన వడ్రంగి, సంగీత పరికరాల తయారీదారుడు అయిన లవ్ హల్టన్ మొక్కల సంగీతాన్ని వినగలిగేందుకు వీలుగా ఈ పరికరాన్ని రూపొందించాడు. దీనికి ‘టెగెల్’ అని పేరు పెట్టాడు. చూడటానికి ఇది ఇటుకలతో తయారు చేసినట్లు కనిపిస్తున్నా, పూర్తిగా కలపతోనే తయారైంది. ఇందులోని మట్టి కుండీలో మొక్కను నాటి, దాని నుంచి వెలువడే ధ్వని తరంగాలను స్వీకరించేలా విద్యుత్తు తీగలను అమర్చాడు. దీనిలోని స్పీకర్ అమరిక ద్వారా మొక్కల నుంచి వెలువడే సంగీతం మనకు కూడా వినిపిస్తుంది. అలాగే దీనికి అమర్చిన కీబోర్డును వాయిస్తూ మనుషులు కూడా సంగీతాన్ని సృష్టించవచ్చు. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ పరికరాన్ని మార్కెట్లోకి తేలేదు. (చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!) -
పాత బంగారం మార్చుకుంటున్నారా?
పండుగలు అంటే కేవలం ఖర్చు చేయడమే కాదు.. భవిష్యత్‌కు ‘బంగారు’బాట వేసుకోవడం కూడా. నచ్చిన గృహోపకరణాలు, గ్యాడ్జెట్లు కొనే వారు, అందులో కొంత ఆదా చేసి భవిష్యత్ కోసం ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోకూడదు? ఇలా ఆలోచించే కొందరు పండుగ సమయాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. బంగారం కేవలం అందాన్ని పెంచే ఆభరణం మాత్రమే కాదు, విలువను పెంచే ఆస్తి. అస్థిరతల్లో ర్యాలీ చేసే పెట్టుబడి సాధనం. కనుక పండుగ సమయాల్లో విలువ తరిగిపోయే వాటి కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టేవారు.. పసిడికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. గడిచిన కొన్నేళ్లలో బంగారం కొనుగోలు ఎన్నో మార్పులను సంతరించుకుంది. 20 ఏళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టే వారు అరుదుగా కనిపించేవారు. తర్వాత కాలంలో ఇందులో స్పష్టమైన మార్పు కనిపించింది. ముఖ్యంగా గడిచిన పదేళ్ల కాలంలో బంగారాన్ని పెట్టుబడి సాధనంగా అర్థం చేసుకోవడం పెరిగింది. గతంలో బంగారంపై పెట్టుబడి అంతా భౌతిక రూపంలోనే ఉండేది. ఇప్పుడు సార్వభౌమ పసిడి బాండ్లు (ఎస్‌జీబీలు), గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయినా, ఇప్పటికీ పెట్టుబడి దృష్ట్యా భౌతిక బంగారానికే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. ధంతేరస్ (ధనత్రయోదశి) వంటి ప్రత్యేక పర్వదినాల్లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు నమోదవుతుంటాయి. ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయ్యే ఆస్తుల్లో బంగారానికి మొదటి స్థానం ఉంటుంది. నేటితరం పాత బంగారాన్ని, కొత్త ఆభరణాలతో మార్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి పాత బంగారం మారి్పడితో కొత్త ఆభరణాలు కొనుగోలు చేయడం సరైనదా..? ఆభరణాలను పెట్టుబడిగా చూడొచ్చా? పెట్టుబడి కోసం ఏ రూపంలో ఇన్వెస్ట్ చేయడం మెరుగు? ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలను ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. బంగారం మార్పిడి విధానం..? పాత బంగారు ఆభరణాలను మార్చుకోవడం వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. మార్కెట్లోకి వచ్చే కొత్త డిజైన్ల పట్ల ఆసక్తి ఏర్పడొచ్చు. పాత నగలు డ్యామేజ్ కావొచ్చు. లేదంటే కొత్త ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి బడ్జెట్ లేక పాత వాటిని మార్చుకోవచ్చు. కారణం ఏదైనా.. పాత బంగారం మార్చుకునే క్రమంలో కొంత నష్టపోతున్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. పాత బంగారం ఆభరణాల మార్పిడికి సంబంధించి మన దేశంలో ప్రామాణిక విధానం అంటూ లేదు. వర్తకుల మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. ఆభరణం కొనుగోలు చేసిన వర్తకుడి వద్దే దాన్ని మార్చుకోవడం వల్ల గరిష్ట విలువను తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. హాల్‌మార్క్ ఆభరణాలు అయితే బంగారం మార్కెట్ ధర మేర విలువను పొందొచ్చు. అయినా కానీ, ఆభరణాల తరుగు–తయారీ చార్జీలు అధికంగా ఉంటున్నాయి. బంగారం ధరలో 10–20 శాతం వరకు తరుగు, తయారీ చార్జీలను జ్యుయలరీ సంస్థలు వసూలు చేస్తున్నాయి. పాత ఆభరణాన్ని మార్చుకున్నప్పుడు అందులో తరుగు–తయారీ రూపంలో కొంత నష్టం ఏర్పడుతుంది. తిరిగి నూతన ఆభరణం కొనుగోలు చేయడం వల్ల, దాని తరుగు–తయారీ చార్జీల రూపంలో అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. కొనుగోలు చేసిన వర్తకుడి నుంచి కాకుండా, వేరొక చోట పాత ఆభరణాన్ని మార్చుకునేట్టు అయితే ప్రక్రియ వేరుగా ఉంటుంది. వర్తకులు కొందరు కొన్ని అంశాల్లో ఏకరూప విధానాన్ని అనుసరిస్తుంటే, కొన్నింటి విషయాల్లో సొంత ప్రక్రియలను అమలు చేస్తున్నారు. పాత బంగారం ఆభరణాన్ని కరిగించి, స్వచ్ఛత చూసిన తర్వాత, కొత్త ఆభరణంతో మార్చుకోవడానికి చాలా సంస్థలు అనుమతిస్తున్నాయి. ‘‘డిజిటల్ స్కేల్ సాయంతో బంగారం ఆభరణం బరువు చూస్తారు. దీని ఆధారంగా స్వచ్ఛతను బట్టి ధర నిర్ణయిస్తారు. సాధారణంగా అనుసరించే స్వచ్ఛతలు 24 క్యారట్ (99.9 శాతం స్వచ్ఛత), 22 క్యారట్ (91.6 శాతం స్వచ్ఛత), 18 క్యారట్ (75 శాతం స్వచ్ఛత). కొందరు జ్యుయలర్లు స్క్రాచ్ (గీయడం), యాసిడ్ టెస్ట్ ద్వారా బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంటారు’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ కమోడిటీస్ హెడ్ హరీశ్.వి తెలిపారు. అన్నింటికంటే ప్రామాణికమైనది హాల్‌మార్క్ స్వచ్ఛత విధానం. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) హాల్‌మార్క్ సరి్టఫికేషన్ సేవలు అందిస్తోందని, హాల్‌మార్క్ గోల్డ్ స్వచ్ఛత పరంగా విశ్వసనీయమైనదిగా హరీశ్ పేర్కొన్నారు. ఇప్పుడు పెద్ద సంస్థలు అయితే క్యారట్‌ను కొలిచే మెషీన్లను ఉపయోగిస్తున్నాయి. వీటినే గోల్డ్ అనలైజర్ మెషీన్లు అంటున్నారు. అందులో బంగారం లేదా ఆభరణాన్ని ఉంచితే బరువు ఎంత, ప్యూరిటీ ఎంత అనే వివరాలను ప్రదర్శిస్తాయి. ఉదాహరణకు వడోదరకు చెందిన రీనా దంపతులు ఎదుర్కొన్న అనుభవాన్ని తెలుసుకుంటే పాత బంగారం మారి్పడి ఇప్పుడు ఎంత సులభంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. వీరివద్దనున్న 20 గ్రాముల బంగారం చైన్ తెగిపోగా, 2014లో మార్చుకుందామని అనుకున్నారు. ఓ జ్యుయలర్ వద్దకు వెళితే, కంటితో చూసి 18 క్యారట్ల బంగారం అని ఖరారు చేసి, రూ.37,500 ధర చెల్లిస్తానని చెప్పాడు. అప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.25,000 స్థాయిలో ఉంది. దీంతో వారు మార్చుకోలేదు. ఇటీవలే అదే చైన్‌ను ఓ వర్తకుడి వద్దకు తీసుకెళ్లగా, గోల్డ్ అనలైజర్ మెషీన్లో పెట్టి చూశారు. 22 క్యారెట్ల ప్యూరిటీ ఉన్నట్టు చూపించింది. దాన్ని కరిగించిన తర్వాత అసలు విలువ చెబుతానని అనడంతో, అందుకు రీనా దంపతులు ఒప్పుకున్నారు. కరిగించిన తర్వాత కూడా 22.1 క్యారెట్ నిర్ధారణ అయింది. దాంతో 10 గ్రాములకు రూ.61,000 చొప్పున విలువ కట్టారు. కొత్త ఆభరణం ధర కూడా అదే రీతిలో ఉండడంతో వారు మార్చుకునేందుకు సమ్మతించారు. కొత్త ఆభరణాల కొనుగోలు బంగారం కూడా ఒక ఆస్తే. ఎవరి పెట్టుబడుల పోర్ట్ఫోలియోకైనా ఇది విలువను పెంచుతుంది. ఆభరణం కోసం కొంటున్నారా? లేక పెట్టుబడి దృష్ట్యా కొంటున్నారా? అన్న స్పష్టత అవసరం. భౌతిక బంగారం, ఆభరణాల రూపంలో ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే తరుగు–తయారీ చార్జీలు, దానిపై జీఎస్టీ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. స్వచ్ఛతకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. నేడు చాలా జ్యుయలరీ సంస్థలు తమ వద్దే విక్రయిస్తే 100 శాతం విలువను చెల్లిస్తున్నాయి. ఒకవేళ ఆభరణంతో మార్చుకోకుండా, నగదు కోరితే మొత్తం విలువలో 5 శాతం వరకు తగ్గించి ఇస్తున్నాయి. పన్ను కోణంలో ఇలా చేస్తున్నాయి. ‘‘జ్యుయలరీ అనేది సెంటిమెంటల్. మనోభావాలతో ఉంటుంది. ఒక తరం నుంచి ఇంకో తరానికి బదిలీ అవుతుంటుంది. అయితే అధిక తరుగు–తయారీ చార్జీల (10–20 శాతం)తో మార్చుకునేందుకు అయ్యే వ్యయం ఎక్కువ. దీనికితోడు జ్యుయలరీ కోసం స్టోరేజ్, లాకర్ చార్జీలను కూడా చెల్లించుకోవాల్సి రావచ్చు. భౌతిక బంగారం అయినా, ఆభరణాలు అయినా అవి వ్యక్తిగత ఆస్తులు. ఒక ఇన్వెస్టర్ పెట్టుబడుల విలువకు తోడు కావు. పెట్టుబడి కోసం అయితే బంగారం కడ్డీలు లేదా కాయిన్లను కొనుగోలు చేయడం కాస్త మెరుగైనది’’ అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దిల్షద్ బిల్లిమోరియా సూచించారు. అయితే బంగారం కాయిన్లు, కడ్డీలను తిరిగి విక్రయించే సమయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె అంటున్నారు. ‘‘బ్యాంక్‌లు కాయిన్లు, కడ్డీలను విక్రయించడమే కానీ, వెనక్కి తీసుకోవడం లేదు. దీంతో వీటిని బయట విక్రయించుకోవాల్సి వస్తుంది. తరుగు, కరిగించేందుకు చార్జీలను ఆ సమయంలో వసూలు చేస్తున్నారు’’అని బిల్లిమోరియా వివరించారు. ఏమిటి మార్గం..? ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కాచుకునే చక్కని హెడ్జింగ్ సాధనం బంగారం అని నిపుణులు చెబుతున్నారు. బంగారంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎవరి పోర్ట్‌ఫోలియోలో అయినా వైవిధ్యం ఏర్పడుతుందని అంటున్నారు. కాకపోతే పెట్టుబడి దృష్ట్యా అయితే ఆభరణాల కంటే మెరుగైన ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్నది నిపుణుల సూచన. గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఎస్‌జీబీలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. ‘‘చారిత్రకంగా చూస్తే బంగారం ధరలు ఆరి్థక పరిస్థితులకు అనుగుణంగా సగటున ఏటా 5–11% మధ్య వృద్ధి చెందాయి. ద్రవ్యోల్బణం పెరిగే సమయంలో గోల్డ్ చక్కని హెడ్జింగ్ సాధనం. పెట్టుబడుల వైవిధ్యం దృష్టా బంగారం ఒక మంచి పెట్టుబడి సాధనం అవుతుంది. అయితే అది కడ్డీలు లేదా జ్యుయలరీ రూపంలో ఉండకూడదు’’ అని బిల్లిమోరీ సూచించారు. పీపీఎఫ్, కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి సాధనాలు బంగారం మాదిరే వైవిధ్యానికి తోడు, మెరుగైన రాబడి, లిక్విడిటీతో ఉంటాయని చెప్పారు. కనుక పాత బంగారం మార్పి డి అనేది అవసరం ఆధారంగానే నిర్ణయించుకోవాలి. ఉపయోగించని ఆభరణాలను మార్చుకుని కొత్తవి తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. పెట్టుబడి కోసం అయితే ఆభరణాలకు బదులు నిపు ణులు సూచించిన ప్రత్యామ్నాయాలను పరిశీలించడం మేలు. దీనివల్ల బంగారం విలువలో నష్టపోయే అవకాశం ఉండదు. 2010 వరకు బంగారం విలువ 10 గ్రాములు రూ.15,000 స్థాయిలోనే ఉండేది. కనుక పెట్టుబడుల దృష్ట్యా భౌతిక బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వారు. కానీ, నేడు ధర గణనీయంగా పెరిగిపోవడంతో, పెట్టుబడి కోణంలో డిజిటల్ బంగారం సాధనాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. -
తాలిబాన్ దురాగతాలు: బ్యూటీ పార్లర్లు ఫినిష్.. ఇప్పుడు వాయిద్య పరికరాల వంతు!
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ ఆంక్షలు, దురాగతాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా తాలిబన్ ప్రభుత్వ అధికారులు సంగీతం అనైతికమైనదని తీర్మానిస్తూ ప్రజల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న సంగీత పరికరాలను హెరాత్ ప్రాంతంలో దహనం చేశారు. ఈ సందర్భంగా స్థానిక అధికారి అల్-ముజ్రిమ్ మాట్లాడుతూ సంగీతాన్ని ప్రోత్సహించడం అనేది నైతిక విలువలను దెబ్బతీస్తుందని, సంగీతాన్ని వాయించేవారు తప్పుదారి పడతారని వ్యాఖ్యానించారు. 2021 ఆగస్టులో అఫ్ఘానిస్తాన్‌ను కబ్జా చేసుకున్న తాలిబాన్ నేతలు ఇష్టమొచ్చిన రీతిన కఠిన శాసనాలను, చట్టాలను చేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా బహిరంగంగా సంగీతం ఆలపించడంపై నిషేధం విధించారు. దీనికి ముందు బ్యూటీ పార్లర్లపై నిషేధం విధించారు. తాజాగా వేల డాలర్ల విలువైన వాయిద్య పరికరాలను స్థానిక ప్రజల నుంచి స్వాధీనం చేసుకుని వాటిని దహనం చేశారు. వీటిలో గిటార్, తబలా, డ్రమ్ తదితర వాయిద్య పరికరాలతో పాటు ఆంప్లిఫయర్, స్పీకర్ మొదలైనవి కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: రణభూమిలో యోగ సాధన: సిరియా ముఖచిత్రాన్ని మారుస్తున్న రిషికేశ్ "Music causes moral corruption and playing it will cause the youth to go astray." Afghanistan's vice ministry burns musical instruments and equipment, deeming music immoralhttps://t.co/as5hDUQ7BX pic.twitter.com/eh9xSgWhkU — AFP News Agency (@AFP) July 31, 2023 -
తాలిబన్ల పైశాచికం.. వీడియో వైరల్
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దురాగతాలు మరోసారి వైరల్ వీడియోలో బట్టబయలయ్యాయి. దేశంలోని పాక్టియా ప్రావిన్స్‌లో.. ఒక సంగీతకారుడి సంగీత పరికరాన్ని తాలిబానీ పురుషులు తగులబెట్టారు. దీనిని చూస్తూ ఒకవైపు సంగీతకారుడు ఏడుస్తుండగా, మరోవైపు తాలిబన్లు తుపాకులు ధరించి దీనిని చూస్తూ పైశాచిక ఆనందం పోందడం గమనించవచ్చు. ఈ వీడియోను అబ్దుల్ హక్ ఒమేరి అనే జర్నలిస్ట్ ట్విటర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్పై తాలిబాన్లు తమ ఆధీనంలోకి వచ్చినప్పటి నుండి, దేశంలో అనేక మార్పులు వచ్చాయి. కార్లలో, వివాహా వేడుకల సమయంలో సంగీతం వినడాన్ని తాలిబాన్ చట్టవిరుద్ధం చేసింది. పురుషులు, స్త్రీలు వేర్వేరు వేదికలలో వివాహాలు జరుపుకోవాలని బలవంతం చేశారు. Video : Taliban burn musician's musical instrument as local musicians weeps. This incident happened in #ZazaiArub District #Paktia Province #Afghanistan . pic.twitter.com/zzCp0POeKl — Abdulhaq Omeri (@AbdulhaqOmeri) January 15, 2022 చదవండి: (అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'వారిని పార్టీలోకి చేర్చుకునేది లేదు') -
కుక్క గోస సమజవుతది..
కుక్క ఓసారి కుయ్యిమంటాది.. మరోసారి భౌభౌమంటాది.. దాని అర్థమేమిటో? అసలు మనం పెంచుకునే కుక్క మన గురించి ఏమనుకుంటుందో.. దాని బాధేమిటో?.. ఇలాంటి డౌట్లతో తెగ ఇబ్బంది పడే యజమానులెందరో.. ఇప్పుడా సమస్య లేదు. ఎందుకంటే.. కుక్క భాష ఇకపై మనకూ అర్థమవుతుంది! స్కాండినేవియాకు చెందిన నార్డిక్ సొసైటీ ఫర్ ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీ శాస్త్రవేత్తలు కుక్కేమన్నా కనిపెట్టే పరికరాన్ని ఒకదాన్ని తయారుచేశారు. చిత్రంలో కనిపిస్తున్నది అదే. ‘నో మోర్ వూఫ్’ అనే ఈ పరికరం బ్రెయిన్ స్కానింగ్ పరిజ్ఞానం ద్వారా కుక్క ఆలోచనా విధానాన్ని కనిపెట్టి.. దాన్ని మన భాషలోకి తర్జుమా చేస్తాయి! శునకం అరుపుల ఆధారంగా శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్నింటిని అలా తర్జుమా చేశారు. అవి.. ఇది చాలా బాగుంది.. నన్ను ఒంటరిగా వదిలేయ్.. నాకు చాలా అలసటగా ఉంది.. ఆకలిగా ఉంది.. నువ్వెవరు?.. మీరెందుకు నన్ను వదిలి వెళ్లిపోతున్నారు. ఈ పరికరం ప్రాథమిక నమూనా మాత్రమే. దీన్ని అభివృద్ధి పరచాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.