మహిళా ఎం.ఎల్‌.ఏలు చరిత్ర సృష్టించారు

Women MLAs have created history - Sakshi

నాగాలాండ్‌ ఏర్పడి 60 ఏళ్లు. 60 సీట్లు ఉన్న అసెంబ్లీలో  ఇప్పటి వరకూ  ఒక్క మహిళ కూడా అడుగుపెట్టలేదు. ఇప్పుడు ఆ ఘనతను ఇద్దరు ఎం.ఎల్‌.ఏలు దక్కించుకొని చరిత్ర సృష్టించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హెకాని జకాలు, సల్‌హౌటనో క్రుసె  విజయం సాధించారు. గురువారం ఓట్ల లెక్కింపు జరగగా డిమాపూర్‌–3 నుంచి హెకాని,  పశ్చిమ అంగమె నుంచి క్రుసె విజయం సాధించారు. అక్కడి పాలనాధికారంలో  స్త్రీలప్రాతినిధ్యం మొదలైంది. ఇది ఆగదు.

మహిళలను ‘ఆకాశంలో సగం’ అంటాం. వారికి అవకాశాలలో సగం దక్కాలన్న ఉద్యమాలు బయలుదేరి చాలా కాలం అయ్యింది. కాని ఇంకా కొన్నిచోట్ల వారికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. పురుష భావజాలం స్త్రీలలో కూడా నాటుకు పోయి స్త్రీకి స్త్రీయే ప్రతికూలత సృష్టించేవరకూ వెళుతోంది. ఉదాహరణకు నాగాలాండ్‌లో పా లనాధికారంలో స్త్రీలు ఉండటాన్ని మొదటినుంచీ వ్యతిరేకించారు.

అక్కడి మొత్తం ఓటర్లు 13 లక్షలు ఉంటే వారిలో దాదాపు ఆరున్నర లక్షల ఓటర్లు మహిళలే అయినా వారు ఒక్క మహిళనూ గెలిపించుకోలేదు. దానికి కారణం అక్కడ ఇంటి పెద్ద, సమూహం పెద్ద, ఊరి పెద్ద ఎవరికి ఓటెయ్యమంటే స్త్రీలు వారికే ఓటు వేయాలి. పురుషులే సంపా దనపరులు కనుక పురుషుల మాట వినాలని స్త్రీలు అనుకుంటారు. పురుషులు సహజంగానే స్త్రీల ్రపా తినిధ్యాన్ని అంగీకరించరు. కనుక 1963లో నాగాలాండ్‌ ఏర్పడితే... 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేవలం 20 మందికే సీట్లు దక్కాయి.

కాని ఎవరూ గెలవలేదు. డిపా జిట్లు కూడా రాలేదు. 2018లో 5 మంది స్త్రీలు పోటీ చేస్తే వారిలో ఎవరూ గెలువలేదు. కాని ఈ ధోరణిలో ఇప్పుడు మార్పు వచ్చిందనే సంకేతాలు అందుతున్నాయి. 2023 ఎన్నికలలో మొత్తం 183 మంది అన్ని పా ర్టీల నుంచి బరిలో దిగగా వీరిలో నలుగురు స్త్రీలు ఉన్నారు. ఈ నలుగురిలో నేషనల్‌ డెమొక్రటిక్‌  ప్రో గ్రెసివ్‌ పా ర్టీ (ఎన్‌.డి.పి.పి) నుంచి ఇద్దరు మహిళలు హెకాని, క్రుసె గెలిచారు. బి.జె.పితో కలిసి ఎన్‌.డి.పి.పి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అందువల్ల ఈ ఇరువురిలో ఎవరైనా మంత్రి అయితే అదీ మరో చరిత్ర కాగలదు.

ఏడు ఓట్లతో  గెలిచిన క్రుసె
నాగాలాండ్‌లోని పశ్చిమ అంగమి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు ఎన్‌.డి.పి.పి అభ్యర్థి, 56 సల్‌హౌటనో క్రుసె ఏడంటే ఏడే ఓట్లతో విజయం సాధించింది. పశ్చిమ అంగమెలో ఆమెకు ప్రత్యర్థిగా నిలిచిన నఖ్రో గతంలో నాగా పీపుల్స్‌ పా ర్టీలో ఉండేవాడు.

ఆ తర్వాత ఎన్‌.డి.పి.పికి జంప్‌ చేశాడు. కాని ఈ ఎన్నికల్లో ఎన్‌.డి.పి.పి టికెట్‌ ఇవ్వక పోయేసరికి ఇండిపెండెంట్‌గా రంగంలో దిగాడు. అతణ్ణి ఓడించడానికి క్రుసె సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సి వచ్చింది. హోటల్స్‌ రంగంలో ఉన్న క్రుసె నాగాలాండ్‌లోని సామాజిక సంస్థలకు కలిసి పని చేస్తోంది. తన గిరిజన తెగ మహిళా విభాగానికి నాయకురాలిగా కూడా ఉంది. ఈమె గెలుపుతో అంగమిలో భారీ వేడుకలు మొదలయ్యాయి. జనం బారులు తీరి అభినందనలు తెలుపుతున్నారు.

మొదటి విజేత హెకాని
నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం జరిగిన ఫలితాల లెక్కింపులో ఆ రాష్ట్రంలో గెలిచిన మొదటి మహిళా ఎం.ఎల్‌.ఏగా ఎన్‌.డి.పి.పి అభ్యర్థి హెకాని జకాలు (47) మొదట డిక్లేర్‌ అయ్యింది. ఆ తర్వాతే రెండో మహిళా అభ్యర్థి క్రుసె గెలుపు ప్రకటితమైంది. అందువల్ల హెకాని విజయం విశేషంగా మారింది.  

డిమాపూర్‌–3 నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎం.ఎల్‌.ఏ జిమోమిని 1536 ఓట్లతో ఓడించింది హెకాని. అయితే ఈమెకు ఈ గెలుపు ఊరికే రాలేదు. సుదీర్ఘ కృషి ఉంది. డిమాపూర్‌లో పుట్టి పెరిగిన హెకాని ఢిల్లీలో చదువుకుంది. ఆ తర్వాత అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కోలో లా చదివింది. నాగాలాండ్‌లో ‘యూత్‌నెట్‌ నాగాలాండ్‌’ అనే ఎన్‌.జి.ఓను స్థాపించి యువతీ యువకుల చదువుకు,ఉపా ధికి మార్గం చూపింది.

‘మేడ్‌ ఇన్‌ నాగాలాండ్‌’ పేరుతో వస్తు ఉత్పత్తి, ఆవిష్కరణల కోసం కోహిమాలో ఒక సెంటర్‌ నడుపుతోందామె. అందుకే ఆమెకు నారీశక్తి పురస్కారం లభించింది. ఈ ఎన్నికలలో ఆమె తన విజయం కోసం గట్టిగా పోరాడింది. స్త్రీల విద్య, ఉపా ధికి హామీలు ఇచ్చింది. ఆమె కోసం అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ ప్రచారం చేశాడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top