ఇదేం నిరసన..! 'గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’ | Women In Indore Rally For Clean Shaven Boyfriend Goes Viral On Social media | Sakshi
Sakshi News home page

ఇదేం నిరసన..!'గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’

Oct 24 2024 11:42 AM | Updated on Oct 24 2024 11:42 AM

Women In Indore Rally For Clean Shaven Boyfriend Goes Viral On Social media

యువతుల వినూత్న ర్యాలీ... కాలానుగుణంగా యువతలో ఫ్యాషన్‌ అభిరుచులు మారుతున్నాయి. అబ్బాయిల్లో ఇటీవల ఎక్కువమంది గడ్డం, జుట్టు పెంచి ఫ్యాషన్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై ఇండోర్‌లో ఉన్న కొందరు కాలేజీ యువతులు అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మాకు గడ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ యువతులు ఈ వినూత్న ర్యాలీకి శ్రీకారం చుట్టారు. 

‘గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’ అనే నినాదంతో యువతులు ముఖాలకు గడ్డం మేకప్‌తో ర్యాలీ నిర్వహించారు. వారి చేతిలో ఉన్న ప్లకార్డులపై ’నో క్లీన్‌ షేవ్‌.. నో లవ్‌’, ’మాకు గడ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్‌ కావాలి’, ‘నో క్లీన్‌ షేవ్‌.. నో గర్ల్‌ఫ్రెండ్‌’ వంటి లైన్స్‌ కనిపించాయి. ఈ ర్యాలీ తాలూకు వీడియోను ఓ ‘ఎక్స్‌’ యూజర్‌ నెట్టింట ΄ోస్ట్‌ చేశారు. దాంతో ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

‘ఈ యువతుల డిమాండ్‌ కరెక్టే. వారానికి ఒక్కసారైనా క్లీన్‌ షేవ్‌ కాకున్నా కనీసం ట్రీమ్‌ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్‌మన్‌లా కనిపిస్తాం‘ అని ఒకరు కామెంట్‌ చేశారు. ‘మా బాడీ మా ఇష్టం’ అని ఒకరు కామెంట్‌ చేస్తే ‘వారి గడ్డం.. వారి ఇష్టం.. మధ్యలో మీకెందుకు‘ అని ఇంకొకరు కామెంట్‌ చేశారు.    

(చదవండి: అతుకులే అదుర్స్‌! ఏకంగా 180 క్లాత్‌ ప్యాచ్‌లు..)

Advertisement
 
Advertisement
Advertisement