breaking news
shavings
-
ఇదేం నిరసన..! 'గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’
యువతుల వినూత్న ర్యాలీ... కాలానుగుణంగా యువతలో ఫ్యాషన్ అభిరుచులు మారుతున్నాయి. అబ్బాయిల్లో ఇటీవల ఎక్కువమంది గడ్డం, జుట్టు పెంచి ఫ్యాషన్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై ఇండోర్‌లో ఉన్న కొందరు కాలేజీ యువతులు అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మాకు గడ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలంటూ యువతులు ఈ వినూత్న ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ‘గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’ అనే నినాదంతో యువతులు ముఖాలకు గడ్డం మేకప్‌తో ర్యాలీ నిర్వహించారు. వారి చేతిలో ఉన్న ప్లకార్డులపై ’నో క్లీన్ షేవ్.. నో లవ్’, ’మాకు గడ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి’, ‘నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్’ వంటి లైన్స్ కనిపించాయి. ఈ ర్యాలీ తాలూకు వీడియోను ఓ ‘ఎక్స్’ యూజర్ నెట్టింట ΄ోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఈ యువతుల డిమాండ్ కరెక్టే. వారానికి ఒక్కసారైనా క్లీన్ షేవ్ కాకున్నా కనీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్మన్లా కనిపిస్తాం‘ అని ఒకరు కామెంట్ చేశారు. ‘మా బాడీ మా ఇష్టం’ అని ఒకరు కామెంట్ చేస్తే ‘వారి గడ్డం.. వారి ఇష్టం.. మధ్యలో మీకెందుకు‘ అని ఇంకొకరు కామెంట్ చేశారు. (చదవండి: అతుకులే అదుర్స్! ఏకంగా 180 క్లాత్ ప్యాచ్‌లు..) -
సెలూన్లకు టర్కీ మగాళ్ల పరుగులు
అంకారా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులుగా అనుమానిస్తున్నారనే భయంతో టర్కీలోని మగవాళ్లంతా తమ గడ్డాలను తీయించుకుంటున్నారు. ఆగస్టు 7న పెద్ద గడ్డాలతో ఉన్న 19 మంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఎగీనా రాష్ట్రం మనీసాలో పట్టుబడ్డారు. గడ్డాలు పెంచుకుంటున్న వారిని ఉగ్రవాదులుగా ప్రజలు అనుమానిస్తున్నారని, దీంతో వీరంతా సెలూన్లకు వస్తున్నారని అక్కడి హెయిర్ డ్రెస్సెర్స్ అసోసియేషన్ తెలిపింది. గతంలో ఇక్కడి వారంతా కొత్త స్టైల్ కోసమని సుదీర్ఘకాలంగా గడ్డాలు పెంచేవారని, దీనివల్ల తమ సెలూన్ల వ్యాపారాలు సన్నగిల్లాయని వివరించింది.