వీకెండ్‌ స్పెషల్‌ : శాకాహారులు మెచ్చేలా మష్రూమ్‌ పిజ్జా, కట్లెట్‌ బజ్జీ | weekend speical mushrooms recipes check here | Sakshi
Sakshi News home page

వీకెండ్‌ స్పెషల్‌ : శాకాహారులు మెచ్చేలా మష్రూమ్‌ పిజ్జా, కట్లెట్‌ బజ్జీ

May 31 2025 5:03 PM | Updated on May 31 2025 5:37 PM

weekend speical mushrooms recipes check here

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుట్టగొడుగులతో కేవలం కూరలే కాకుండా, రుచికరమైన చిరుతిళ్లు కూడా చేసుకోవచ్చు. నిజానికి మాంసాహారం తినని వారికి ఇవి చక్కటి ప్రత్యామ్నాయం అంటుంటారు చాలామంది. అలాంటి మష్రూమ్‌తో ఈ టేస్టీ స్నాక్స్‌ మీకోసం.

మష్రూమ్‌ పిజ్జాలు 

కావలసినవి: పెద్ద పోర్టబెల్లా పుట్టగొడుగులు– 4 (లోపలి భాగం తొలగించి గుంతలా చేసుకోవాలి); టమాటో సాస్‌ – 3 టేబుల్‌ స్పూన్లుమొజారెల్లా చీజ్‌ తురుము – అర కప్పు; ఆలివ్‌ ఆయిల్‌ – ఒక టేబుల్‌ స్పూన్‌; వెల్లుల్లి రెబ్బలు – 2 రెబ్బలు (సన్నగా తరిగినవి); ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు, మొక్కజొన్న గింజలు, చిల్లీ ఫ్లేక్స్, పుదీనా తురుము, టమాటో ముక్కలు– కొద్దికొద్దిగా (అభిరుచిని బట్టి); ఉప్పు – సరిపడా; మిరియాల   పొడి – చిటికెడు.

తయారీ: ముందుగా ఓవెన్‌ను 200 డిగ్రీల సెల్సియస్‌లో ప్రీహీట్‌ చేసి పెట్టుకోవాలి. పుట్టగొడుగులకు అన్నివైపులా కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ రాసి, బేకింగ్‌ ట్రేలో ఉంచి, 5 లేదా 7 నిమిషాలు బేక్‌ చేసి, బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఆ పుట్టగొడుగుల లోపల పిజ్జా సాస్‌ రాసి, వాటిలో మొజారెల్లా చీజ్‌తో పాటు ఉల్లి΄ాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు, స్వీట్‌ కార్న్‌ (వీటితోపాటు అదనంగా నచ్చినవి జోడించుకోవచ్చు) వంటివి వేసుకోవాలి. మళ్ళీ ఓవన్‌లో, చీజ్‌ కరిగే వరకూ బేక్‌ చేసుకుని, వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవచ్చు...

మష్రూమ్‌ బజ్జీ

కావలసినవి: మష్రూమ్స్‌ – ఒక కప్పు (శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి); శనగపిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – 2 టేబుల్‌ స్పూన్లు; మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – ఒక టీ స్పూన్‌ చొప్పున; కారం, పసుపు, వాము  పొడి, ఉప్పు – కొద్దికొద్దిగా; నీరు, నూనె – సరిపడా; వంట సోడా – కొద్దిగా.

తయారీ: ముందుగా శనగపిండి, బియ్యప్పిండి, అల్లం –వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, వాము ΄÷డి, ఉప్పు, వంట సోడా వేసుకుని, తగినంత నీళ్లు ΄ోసుకుంటూ బజ్జీల పిండిలా చిక్కగా కలుపుకోవాలి. అనంతరం ఒక్కో పుట్టగొడుగును శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి ఇవి.

మష్రూమ్‌ కట్లెట్స్‌ 
కావలసినవి: పుట్టగొడుగులు – 200 గ్రాములు; బంగాళాదుంపలు – 4 చిన్నవి (ఉడికించి, తొక్క తీసి మెత్తగా గుజ్జులా చేసుకోవాలి); ఉల్లిపాయ – ఒకటి (చిన్నగా తరగాలి); నూనె – సరిపడా; పచ్చిమిర్చి – ఒకటి (సన్నగా తరగాలి); కొత్తిమీర పొడి ఒక టేబుల్‌ స్పూన్‌; ఇంగువ, పసుపు – అర టీస్పూన్‌ చొప్పున; జీలకర్ర  పొడి – ఒక టేబుల్‌ స్పూన్‌; గరం మసాలా పొడి– అర టేబుల్‌ స్పూన్‌; కొత్తిమీర తరుగు – అర కప్పు; శనగ పిండి – 3 టేబుల్‌ స్పూన్లు; పాలు – 2 టేబుల్‌ స్పూన్లు; గుడ్డు – ఒకటి; బ్రెడ్‌ పౌడర్‌ – కొద్దిగా; ఉప్పు – తగినంత.

తయారీ: ముందుగా పుట్టగొడుగులను శుభ్రం చేసి, తడిలేకుండా తుడిచి, చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుని పక్కనపెట్టుకోవాలి. అనంతరం పాన్‌లో నూనె వేడి చేసుకుని ఉల్లి΄ాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి. తర్వాత ఇంగువ, పుట్టగొడుగు ముక్కలు, పసుపు, కొత్తిమీర తరుగు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి 2–3 నిమిషాలు ఉడికించి, చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో బంగాళదుంప గుజ్జు, శనగపిండి, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నచ్చిన షేప్‌లో కట్లెట్స్‌లా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ΄ాత్రలో గుడ్డు,పాలు వేసి బాగా కలిపి, దానిలో ఈ కట్లెట్స్‌ ముంచి, బ్రెడ్‌ పౌడర్‌ పట్టించి, వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరి΄ోతుంది. వీటిని టమాటో సాస్‌లో ముంచి తింటే భలే రుచిగా ఉంటాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement