భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర, దూకుడు గల ఓపెనింగ్ బ్యాట్స్మెన్లలో ఒకరు. ఇవాళ ఆయన 48వ పుట్టిన రోజున జరుపకుంటున్నారు. ఆయన 1999 నుంచి 2013 వరకు భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించారు. దశాబ్దానికి పైగా సాగిన తన కెరీర్లో ఆయన అర్జున అవార్డు, పద్మశ్రీ వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. అదృష్టవశాత్తు ఆయన కుమారులిద్దరూ క్రికెటర్లే. ఆర్యవీర్ అండర్ 19 క్రికెట్ ఆడుతుండగా, వేదాంత్ అండర్ 16 క్రికెట్ ఆడుతున్నాడు. ఇవాళ ఆయన 48వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఓ మంచి తండ్రిగా ఆయన అనుసరించే పేరెంటింగ్ టిప్స్ ఏంటో చూద్దామా..!.
ఓ క్రికెటర్‌గా ఉండటం కంటే ఇద్దరు పిల్లలకు తండ్రిగా వ్యవహరించడమే అత్యంత కీలకమైనదని, కష్టమైనది కూడా అని అంటున్నాడు. పిల్లలు సహజంగా కనిపించే ప్రతి వస్తువుకి ఆకర్షితులవ్వుతారు. దాంతో సునాయాసంగా అది కావాలని తండ్రిని ఈజీగా అడిగేస్తారు. అందువల్ల వాళ్లకు చిన్న వయసు నుంచే ఆర్థిక పాఠాలు నేర్పాలని అంటున్నారు. తన కుమారులకు ఏవిధంగా ఆర్థిక పాఠాలు నేర్పించానో కూడా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారాయన. అవేంటో చూద్దామా..!
పిల్లలు కనిపించే ప్రతి వస్తువుకి ఆకర్షితులవుతారు. అందువల్ల వాళ్లకు డబ్బు విలువ గురించి నేర్పించాల్సిన బాధ్యత తలిదండ్రులదేనని చెబుతున్నారు సెహ్వాగ్. తన పిల్లలు క్రికెట్ ఆడుతూ సంపాదించడం మొదలయ్యాక ఎంత వరకు ఖర్చు పెట్టొచ్చో తెలసుకున్నాని అన్నారు. ప్రస్తుతం ఇద్దరు అండర్, అండర్ 19 స్థాయిలో ఆడుతూ సుమారు రూ. 2 నుంచి, రూ. 3 లక్షల రూపాయల వరకు ఆర్జిస్తున్నట్లు పేర్కొన్నారు. వారిలో ఒకడు కారులోపెట్రోల్ కొట్టించగా..ఏడు వేలుబిల్లు అయ్యిందని తెలిసి షాక్‌కి గురయ్యాడు.
వాడి చేత స్వయంగా బిల్లు కట్టించడంతోనే తన కుమారుడికి ఈ విషయం అర్థమైందన్నారు. తనలా బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్లో వెళ్తాలని అనుకుంటారు, పైగా తన చేతి వాచ్‌లను తీసుకుని పెట్టుకుంటుంటారు వాళ్లు. ఇంకా చిన్న పిల్లలు కాబట్టి ఆ లగ్జరీ వస్తువుల పట్ల వ్యామోహం ఉంటుంది. కానీ ఓ స్థాయికి చేరుకున్నాక..జీవితంలో ఇవేమి నిజమైనవి కావు అని అర్థమవుతుంది. పైగా ఇదంతా బయటకు గొప్పగా కనిపించే జీవితం మాత్రమే అని తెలిసి వస్తుంది.
తన కుమారులకు తాను ఎప్పుడూ ఒక లక్ష్యంతో జీవించాలని సలహా ఇస్తుంటానని అన్నారు. ప్రదర్శన కోసం జీవించొద్దు, నిజమైన జీవితాన్ని గడపండి అని చెబుతుంటానని అన్నారు. వావ్ అతను ఎంత గొప్ప పనిచేశాడు అని ఇతరులు మెచ్చుకునేలా జీవించమని చెబుతుంటానని అన్నారు. అయితే తన పిల్లలను తన స్థార్డమ్ వల్ల కలిగే ఇబ్బందులు, లాభాలు గురించి ముందుగానే వివరించానన్నారు. మిమ్మల్ని నాన్నతో పోలుస్తూ..విమర్శిస్తుంటారు. ఒకవేళ బాగా ఆడితే అంతకంటే ఎక్కువగా ప్రసంశిస్తారు ఎందుకంటే అది తనపై ఉన్న అభిమానం కూడా కారణం కావొచ్చన్నారు.
అందుకే ఫస్ట్ క్లాస్ లేదా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినప్పుడు పోలికలు మిమ్మల్ని వెంటాడుతుంటాయి, కానీ వాటికి చలించకుండా ఉండటం ముఖ్యం అని నేర్పించానని అన్నారు. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి మిగదంతా అనవసం అని చెబుతుంటానని అనఆనరు. ఏనుగు మొరిగే కుక్కలను ఎలాగైతే పట్టించుకోదో అలా ఎవరు ఏం చెప్పినా..కామెంట్ చేసినా..ఆ ప్రభావం మీపై అస్సలు ఉండకూదని ముందే ట్రైన్ చేశానన్నారు. పిల్లలకు ముందుగా కొన్ని విషయాలపై అవగాహన కల్పించేలా వివరిస్తూ..వాటిని హ్యాండిల్ చేయడం, తమంతటా తాముగా డెవలప్ అవ్వడం మొదలవుతుందని చెప్పకనే చెప్పాడు వీరూ. సో ఇంకెందుకు ఆలస్యం ఫాలోకండి మరి..!.


