టైటానిక్‌ ప్యాలెస్‌!

Titanic House: Man Build House Look Like Titanic West Bengal - Sakshi

ఫొటోలో కనిపిస్తున్న టైటానిక్‌ని పోలి ఉండే ఈ ఓడ విరిగిపోదు, మునిగిపోదు. ఎందుకంటే, ఇది అసలు ఓడే కాదు. ఇదొక ఇల్లు, ఈ ఇంటి యజమాని పేరు మింటు రాయ్‌. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ ఇతని ఊరు. కోల్‌కతాలో చదువుతున్న రోజుల్లో ఒకసారి టైటానిక్‌ని పోలి ఉండే దుర్గాపూజ పెండాల్‌ని చూసి ఆకర్షితుడయ్యాడు. చాలామంది దేవి కోసం కంటే ఆ నిర్మాణాన్ని చూడటానికి రావడం గమనించి, తన ఇళ్లు కూడా ఇంతే అందంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం చాలామంది ఇంజనీర్లను సంప్రదించాడు. అయితే, వారికి అతను డబ్బు చెల్లించలేడని వారు తప్పుకున్నారు.

ఆర్థికంగా స్థిరపడటానికి వివిధ రకాల పనులతో పాటు, కొంతకాలం నేపాల్‌ వెళ్లి తాపీపని కూడా నేర్చుకున్నాడు. చివరకు 2010లో ఈ ఓడలాంటి ఇంటిపనులు ప్రారంభించాడు. 39 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పుతో తానే ఓ ప్లాన్‌ తయారు చేశాడు. దాదాపు పదమూడు సంవత్సరాల పాటు అక్కడే నివాసం ఉంటూ, పనులను కొనసాగిస్తూ, తన టైటానిక్‌ ప్యాలెస్‌ని చివరి దశకు తీసుకువచ్చాడు. ఇప్పటి వరకు రూ. 15 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. ఇతని కలకు అతని భార్య ఇతిరాయ్, కొడుకు కిరణ్‌ రాయ్‌ కూడా తోడున్నారు. ‘వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ఆ తర్వాత ఇదే టైటానిక్‌ పైఅంతస్తులో ఓ రెస్టారెంట్‌ నిర్మించి, ఆదాయం పొందుతా’ అని అంటున్నాడు మింటు. 

చదవండి: ఉడుత సాయం కాదు... ఉడుతకే సాయం!
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top