ట్రావెలర్స్‌ వద్ద ఉండాల్సిన 3 గ్యాడ్జెట్స్‌ ఇవే.. | This Three Gadgets Travelers Should Have | Sakshi
Sakshi News home page

ట్రావెలర్స్‌ వద్ద ఉండాల్సిన 3 గ్యాడ్జెట్స్‌ ఇవే..

Jun 22 2026 9:25 AM | Updated on Jun 22 2026 9:25 AM

This Three Gadgets Travelers Should Have

ట్రావెల్‌

గ్యాడ్జెట్స్‌

ప్రపంచం ఎంత వేగంగా మారుతోందో అంతే వేగంగా ప్రయాణికులు స్మార్ట్‌ అవుతున్నారు. నిత్యం కొత్త కొత్త పరికరాలు, సాంకేతికను వాడుతున్నారు. మీరు కూడా స్మార్ట్‌ ట్రావెలర్‌ అవ్వాలంటే ఈ 5 పరికరాల గురించి తెలుసుకోండి.

1. ట్రాకిబుల్‌ పాస్‌పోర్ట్‌ వ్యాలెట్‌
విదేశాల్లో ఉన్నప్పుడు పాస్‌పోర్ట్‌ను గుండెకాయలా చూసుకోవాలి. ఒక వేళ అది మిస్‌ అయితే సగం ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీకు ట్రాకిబుల్‌ పాస్‌పోర్ట్‌ వ్యాలెట్‌ ఉపయోగపడుతుంది. పాస్‌పోర్ట్‌ భద్రంగా ఉండాలి అంటే ఈ పాస్‌పోర్ట్‌ ట్రాకర్‌ మీకు ఉపయోగపడుతుంది.

ఇందులో ఉన్న బ్లూటూత్‌ ట్రాకింగ్‌ టెక్నాలజీ వల్ల మీ పాస్‌పోర్ట్‌ ఉన్న వ్యాలెట్‌ మిస్‌ అయినా మీ ఫోన్‌ వాడి దాని లొకేషన్‌ ట్రాక్‌ చేయవచ్చు. ఈ వ్యాలెట్‌లో క్రెడిట్, డెబిట్‌ కార్డులు, బోర్డింగ్‌ పాస్, ఇతర డాక్యుమెంట్స్‌ దాచుకునే సదుపాయం కూడా ఉంటుంది.

2. హ్యాండ్‌ ఫ్రీ ఫోన్‌ హోల్డర్‌ 
ఈ డిజైజ్‌ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ పాపులర్‌ అవుతోంది. దీనికి కారణం మీరు ఏదైనా కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు హోటల్స్‌లో, వాహనాల్లో దీనిని సులభంగా వాడుకోవచ్చు. ఫోనును చేతితో పట్టుకోకుండా డెస్కుకు, సీటుకు ఒక క్లిప్పులా పెట్టేసి వీడియోలు, ఫోటోలు, మ్యాప్స్‌ చూడవచ్చు. కార్లు, బైకు, విమానం బస్సులో కూడా వీటిని వినియోగించవచ్చు. ఆన్‌ లైన్లో మీకు వందల రకాలు మొబైల్‌ హోల్డర్స్‌ లభిస్తాయి.

3. సోలార్‌ పవర్‌ బ్యాంక్‌
ఈ రోజుల్లో మన ఫోన్‌ తో పాటు ఇతర పరికరాలను చార్జ్‌ చేసి పెట్టడం అనేది చిన్న ఛాలెంజ్‌ లాంటిదే. మరీ ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు మరీ ఈ ఛాలెంజ్‌ కాస్త కష్టంగా మారిపోతుంది. దీని కోసం మీరు మల్టి కేబుల్‌ సోలార్‌ పవర్‌ బ్యాంక్‌ వినియోగించవచ్చు. ఇది ఇకో ఫ్రెండ్లీ అయిన చార్జింగ్‌ విధానం.

ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించిన గ్యాడ్జెట్స్‌ వినియోగించి మీరు ప్రయాణాన్ని ప్రశాంతంగా కొనసాగింవచ్చు. ఇవే కాకుండా మీకు తెలిసిన, మీరు వాడుతున్న స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ ఏమైనా ఉంటే కామెంట్‌ చేయగలరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement