
ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ల యుగంలో చిన్న, పెద్ద అందరూ కంటి సమస్యలతో బాధపడుతున్నారు. పెద్ద వయసులో వచ్చే కార్నియా సమస్యలు సైతం వచ్చేస్తున్నాయి చిన్నారులకు. అందువల్ల ఈ మొబైల్ వ్యసనం బారినపడుకుండా చూడటమే గాక ఈ పండ్లు కూరగాయలతో కంటి సమస్యలను అధిగమించొచ్చు అని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో చూద్దామా..!
ఆకుకూరలు..
పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి. పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలపై పోరాడటంతో ప్రముఖపాత్ర పోషిస్తాయి. ఆకుకూరలు.. మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం లాంటి సమస్యల నుంచి రక్షించి కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతాయి.
దానిమ్మ
దానిమ్మ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తహీనతతో బాధపడేవారిని దానిమ్మ తినమని సలహా ఇస్తారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తికి పెంచుతాయి. అంతేనా దానిమ్మని రెగ్యులర్‌గా తింటే ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. కాబట్టి ప్లేట్‌లెట్స్‌ని పెంచుకునేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది.
డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్... శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. దీంతోపాటు కంటిచూపును మెరుగు పర్చి నేత్ర సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. వీటిలో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
(చదవండి: ఊరికే అలసిపోతున్నారా? ఐతే ఇది పొటాషియం లోపం కావచ్చు..)