సంతోషంతో కళ్లు మెరిసేటప్పుడు కళ్లల్లో నక్షత్రాలు మెరిశాయనడం ఒక వాడుక. కళ్లల్లో నక్షత్రాల సంగతి సరే, అతడి కంటిలో మాత్రం ఏకంగా వజ్రమే మిలమిల మెరుస్తుండటం విశేషం. ఇతగాడి పేరు స్లేటర్ జోన్స్. అలబామా దేశస్థుడు. కొంతకాలం కిందట ప్రమాదవశాత్తు ఒక కన్ను పోగొట్టుకున్నాడు. ప్రమాదాల్లో కన్ను కోల్పోతే, సాధారణంగా కృత్రిమంగా గాజు కనుగుడ్డును అమర్చుకుంటారు.
స్లేటర్ దొరగారు బాగా డబ్బున్న మారాజు, పైగా వజ్ర వైడూర్యాది ఆభరణాలతో వ్యాపారం చేసే నగల వర్తకుడు కావడంతో అందరిలాగా గాజు కనుగుడ్డును అమర్చుకుంటే తన ప్రత్యేకత ఏముంటుందని అనుకున్నాడో ఏమో! ఏకంగా రెండు క్యారెట్ల వజ్రంతో కృత్రిమ కనుగుడ్డును ప్రత్యేకంగా తయారు చేయించుకుని, పోయిన కనుగుడ్డు స్థానంలో అమర్చుకున్నాడు.
ప్రపంచంలో బహుశా ఇదే అత్యంత ఖరీదైన కృత్రిమ కనుగుడ్డు కావచ్చని అంతర్జాతీయ వార్తాసంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వజ్రనేత్రుడి వ్యవహారం ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
(చదవండి: సేఫ్టి షర్ట్..!)


