ఊరికే అలసిపోతున్నారా? | Health Tips: Symptoms of potassium deficiency | Sakshi
Sakshi News home page

ఊరికే అలసిపోతున్నారా? ఐతే ఇది పొటాషియం లోపం కావచ్చు..

Jul 5 2025 9:30 AM | Updated on Jul 5 2025 9:30 AM

Health Tips: Symptoms of potassium deficiency

మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం  ఒకటి. పొటాషియం మన శరీరంలో బీïపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్‌ రాకుండా చూస్తుంది. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పొటాషియం తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. 

అందువల్ల పొటాషియం ఉండే ఆహారాలను తీసుకోవాలి. పొటాషియం లోపిస్తే కండరాలు బలహీనంగా మారుతాయి. కండరాలు పట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆకలి లేక΄ోవడం, మానసిక కుంగుబాటు, తరచు వాంతులు, విరేచనాలు అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మలంలో రక్తం కూడా వస్తుంది. అందువల్ల  పొటాషియం లోపించకుండా చూసుకోవాలి.

సాధారణంగా మనకు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం అవుతుంది. మనం తినే ఆహారాల నుంచే మనకు పొటాషియం లభిస్తుంది. సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు.

ఎందులో లభిస్తుందంటే.. 
కోడిగుడ్లు, టమాటాలు, చిలగడ దుంపలు, విత్తనాలు, నట్స్, అరటి పండ్లు, యాప్రికాట్స్, చేపలు, తృణ ధాన్యాలు, పెరుగు, పాలు, మాంసం, తర్బూజా, క్యారెట్, నారింజ, కివీ, కొబ్బరినీళ్లు, బీట్‌రూట్‌ వంటి ఆహారాల్లో పొటాషియం విరివిగా లభిస్తుంది కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే పొటాషియం లోపం రాకుండా ఉంటుంది.

మనం ఏం చేయాలంటే...

  • ఎవరైనా ‘మిరాకిల్‌ క్యూర్‌‘ అంటే వారి మాటలు నమ్మవద్దు. వాస్తవాలను చెక్‌ చేయాలి. 

  • ఇన్‌ఫ్లూయెన్సర్ల మాటల్ని అస్సలు నమ్మవద్దు. సోషల్‌ మీడియాలో చెప్పే ఔషధాలు/క్రీములు చాలావరకు నిర్ధారణ కానివే. 

  • వేళకు పోషకాహారం తినడం, నిద్ర, వ్యాయామం.. ఇవే నిజమైన యవ్వన రహస్యాలు.

  • వయస్సు పెరిగినా యవ్వనాన్ని అవగాహనతో అందంగా, ఆరోగ్యంగా నిలుపుకోవచ్చు.

  • ఔషధాలా, చికిత్సలా అనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ముందు, పూర్తి అవగాహనకు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 

(చదవండి: ఎప్పటికీ యవ్వనంగా.. అలాంటి చికిత్సలు తీసుకోవచ్చా..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement