తన్నీరు శశి
ఉపాధ్యాయురాలిగా నేను 1992లో చాక్‌పీస్ పట్టుకున్నాను. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న చిన్నారులు, అందులోనూ పేదింటి పిల్లలకు చదువు చెప్పేటప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. నా కన్నపిల్లలు ఇద్దరైతే 32 ఏళ్ల సర్వీస్‌లో దేవుడిచ్చిన పిల్లలు ఇరవై వేలకు పైనే.
జ్వరంతో పరీక్ష రాసింది..
లక్ష్మి... చక్కగా చదివే అమ్మాయి. నేను వాళ్లకు మాథ్స్ టీచర్‌ని, హౌజ్ పేరెంట్‌ని కూడా. మాథ్స్ పరీక్షకు ముందు లక్ష్మికి అమ్మవారు ΄ోసింది. ఒళ్లంతా కాలి΄ోతూ ఉంది. హాస్పిటల్‌కి తీసుకెళ్లి సెలైన్ పెట్టించి, బెడ్ పక్కనే ఉండి ధైర్యం చెపుతూ ఉన్నాను. ఉదయానికి జ్వరం కొంచెం తగ్గింది.‘పరీక్ష రాయగలవా?‘ అని అడిగాను.
‘మీరు పక్కన ఉంటే రాస్తాను‘ అంది ధైర్యంగా. మెల్లిగా సెంటర్‌కి తీసుకొని వెళ్ళాను. మా అబ్బాయికి కూడా ఆ రోజు పదో తరగతి పరీక్ష. కానీ ఈ పిల్లలే నా తొలి ్రపాధాన్యం. మొదటి అంతస్తు లో లక్ష్మి పరీక్ష గది.
‘ఎక్కగలవా లక్ష్మీ?‘ అడిగాను. నీరసంగా బదులిచ్చింది. కొబ్బరి నీళ్లు తాగించి ఎగ్జామ్ హాల్‌లో పక్క పిల్లలకి లక్ష్మి గురించి చెప్పి కిందకు వచ్చాను. రిజల్ట్ వచ్చింది. చక్కటి మార్క్స్. పదో తరగతి మార్కులతోనే ΄ోస్ట్ ఆఫీస్ ఉద్యోగంలో చేరిందని తెలిసి ఎంత సంతోషం వేసిందో! ఓల్డ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు ‘పక్క వాళ్లకు మంచి చేస్తున్నారా? చెడు అలవాట్లు చేసుకున్నారా?‘ అని రెండు ప్రశ్నలు వేస్తాను. వాళ్లు ‘మేము మీ స్టూడెంట్స్ మేడం’ అంటారు. నా పిల్లలు ఇంజినీర్లు, టీచర్స్, నర్స్‌లు, ఎస్.ఐ, ్రపాజెక్ట్ మేనేజర్ లు, ఫిజియో థెరపిస్టులు... ఇందరికి అమ్మగా ఉండగల వరం ఇదిగో ఈ ఉపాధ్యా వృత్తిలోనే సాధ్యం. అబ్దుల్ కలాం గారి అడుగుజాడల్లో నడిచే నాకు ఇంతకంటే కావలసింది ఏముంది! చివరి క్షణం వరకూ అధ్యాపకురాలిగానే ఉంటాను.
చదువు కోసం పెళ్లిని వాయిదా వేసింది..
‘ఉమ‘. పదో తరగతి మంచి మార్క్స్‌తో పాస్ అయింది. మా గురుకుల పాఠశాలలోనే ఇంటర్ చదివింది. రోజూ నా క్లాస్‌కి వచ్చి కొద్దిసేపు ఉండేది. ఎందుకలా అని అడిగినప్పుడు ‘మా అమ్మను చూసినట్లు ఉంటుంది. ఇప్పుడు మీరు క్లాసుకు రావడం లేదు కదా! అందుకే రోజూ వచ్చి చూసి వెళ్తున్నాను’ అని ఉమ చెప్తుంటే నాకు కన్నీళ్లాగలేదు. ఇంటర్ తరువాత మా ఇంటికి వచ్చి ‘బీటెక్‌లో చేరడానికి కాలేజ్‌లు ఆప్ష¯Œ ్స పెట్టండి... పదో తరగతి తరువాత పెళ్లి చేసుకోవద్దు... ఇంట్లో ఒప్పించి చదవండి అని మీరు చెప్పేవారు కదా. నేను మా నాన్నను అలాగే ఒప్పించి చదువుకోబోతున్నాను. చదువు తరువాతే పెళ్లి అని చెప్పేశాను’ అంటున్న ఉమని చూస్తే తృప్తి. ఉమ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. మరో ఇంజినీర్ నే పెళ్లి చేసుకున్నది... అని తెలిసినప్పుడు సంతృప్తి. – తన్నీరు శశి, గణిత అధ్యాపకురాలు, పుదూరు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, తిరుపతి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment