చెయ్యెత్తి మొక్కేలా షిరిడీ సాయిబాబా! అంతేనా..! | Special story on Artist sculpture Rajesh | Sakshi
Sakshi News home page

చెయ్యెత్తి మొక్కేలా షిరిడీ సాయిబాబా! అంతేనా..!

Jun 26 2025 10:36 AM | Updated on Jun 26 2025 12:42 PM

Special story on Artist sculpture Rajesh

అతడు మలిచిన శిల్పాలు జీవం పోసుకున్నాయా అన్నట్లు కనిపిస్తాయి.. కాస్త దూరం నుంచి చూస్తే అరె అక్కడ ఎవరో ఉన్నారు అనే భావన కలుగుతుంది. చేతితో తాకి చూస్తే తప్ప శిల్పం అని తెలుసుకోలేం.. మనతో లేని వారు మనమధ్యే ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. శిల్పం తయారు చేస్తున్నంత సేపు అతడు తపస్సులో ఉన్నాడా అనిపిస్తుంటుంది.  అతడి పేరే రాజేష్‌ – విజయనగర్‌కాలనీ  

నగరంలో పుట్టిపెరిగిన అతడు 1993లో మాసబ్‌ట్యాంక్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో చదివాడు. ఆ సమయం నుంచే విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించాడు. 2021లో అతడు రూపొందించిన సాయిబాబా విగ్రహాన్ని మహారాష్ట్రలోని షిరిడీ  సంస్థాన్‌కు అందజేయగా అక్కడ ధ్యాన మందిరంలో ఆ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ సజీవ శిల్పాన్ని చూసి అబ్బురపడ్డ పలువురు మరో ఐదు విగ్రహాలు తయారు చేయాలని ఆర్డర్‌ ఇవ్వగా ఆయన మొదటి వారంలోనే విగ్రహాలను తయారు చేసి షిరిడీ సంస్థాన్‌కు అందజేశారు. 

అతడి చేతులమీదుగా దివంగత జి.పుల్లారెడ్డి దంపతులు, ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు, మైకెల్‌ జాక్సన్, రాఘవేంద్రస్వామి, చంద్రశేఖర సరస్వతిజీ, సంత్‌సేవాలాల్‌ విగ్రహాలతో పాటు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర టూరిజం, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎం తదితర సంస్థలకు రాజేష్‌ ప్రస్తుతం పెయింటింగ్, శిల్పాలు వారి ఆర్డర్‌ మేరకు తయారు చేసి ఇస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement